ఎల్లో మీడియా దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలా ? : విజయసాయిరెడ్డి
By రాణి Published on 10 March 2020 3:35 PM IST
యెస్ బ్యాంక్ స్కాం పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. యెస్ బ్యాంక్ స్కాం వెనకాల చంద్రబాబున్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు. ''రాణా కపూర్ ను ఈడి అరెస్టు చేసింది. Yes Bank అక్రమ లావాదేవీల గుట్లన్నీ చేతికి చిక్కాయి. సమగ్రంగా దర్యాప్తు జరిపితే చంద్రబాబుకు ఎంత ముట్టింది కచ్చితంగా బయటపడుతుంది. తమ దేవుడికి ఒకేసారి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయేమిటని ఎల్లో మీడియా విలవిల్లాడుతోంది.'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read :
కాంగ్రెస్ కు సింధియా షాక్..కాసేపట్లో బీజేపీలోకి..
కాగా..యెస్ బ్యాంక్ ఫౌండర్, మాజీ ఎండీ - సీఈఓ రాణా కపూన్ ను ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన రాణా కపూర్ ను కోర్టులో హాజరు పరచాల్సి ఉండగా..అప్పటి వరకూ కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాల్సిందిగా ముంబై సెషన్స్ కోర్టు ఈడీ అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై స్పందించిన విజయసాయి ట్విట్టర్ వేదికగా స్పందించారు.