మధ్యప్రదేశ్ రాజకీయాలు సెకనుకొకలా శరవేగంగా మారుతున్నాయి. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా..పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చారు. ఉదయం మోడీని కలిసిన సింధియా కొద్దిసేపటికే..తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పాలనపై అసంతృప్తిగా సింధియా తనవైపున్న ఎమ్మెల్యేలందరితో కలిసి ఉన్నట్లుండి బెంగళూరు వెళ్లడంతో..ఒక్కసారిగా అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు సింధియాతో పాటు వెళ్లగా..6గురు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. మిగతా నలుగురిలో ఒకరైన సింధియా రాజీనామా చేశారు. ఇంకా ముగ్గురి మనోగతం ప్రశ్నార్థకంగా ఉంది. దీంతో మధ్యప్రదేశ్ అధికార పార్టీ మనుగడ ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

Also Read :
బీజేపీలోకి సింధియా? కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?

కాగా..మధ్యప్రదేశ్ లో సింధియా వర్గానికి చెందిన మరో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును బీజేపీకి ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే..కాంగ్రెస్ కు క్రమంగా మెజార్టీ ఎమ్మెల్యేలు తగ్గిపోతారు. ఫలితంగా కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎమ్మెల్యేల మెజార్టీతో ఉన్న బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.