అమరావతి: ఆదివారం అని కూడా లేకుండా చంద్రబాబుపై ట్విటర్ లో దండెత్తారు వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి పచ్చదండుకు కంటి మీద కునుకులేదంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. సంస్థను దివాళ తీయించి..జీతాలు ఇవ్వలేనివారు ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల లీజ్ పైన, ఆర్టీసీని ప్రైవేటీకరిస్తారని ఏడుపుగొట్టు తనాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ట్విటర్ లో టీడీపీ నేతలపై మండిపడ్డారు విజయసాయి రెడ్డి.