జగన్‌ పర్మిషన్‌ తీసుకొనే మీ ఆవిడకి మెసేజ్‌ చేస్తున్నావా లోకేష్‌..? : విజయ్‌ సాయిరెడ్డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2020 8:31 AM GMT
జగన్‌ పర్మిషన్‌ తీసుకొనే మీ ఆవిడకి మెసేజ్‌ చేస్తున్నావా లోకేష్‌..? : విజయ్‌ సాయిరెడ్డి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 'లోకేష్..! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా...! తీసుకుంటున్నావా...? ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?!' అంటూ లోకేష్‌ పై సెటైర్లు వేశారు విజయ్‌సాయి రెడ్డి.కాగా.. టీడీపీ అధికారాన్ని కోల్పోయాక తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నారా లోకేశ్ పర్యటించారు‌. కోటబొమ్మాళి మండలంలోని అచ్చెన్నాయుడి ఇంటికెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పుడు కేసులతో ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు‌. ఏడాది కాలంగా ఒంటిచేత్తో అధికార పార్టీని ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడ్ని తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఏపీలో ఫేస్‌బుక్‌లో పోస్టు చేయాలన్నా పెళ్లానికి వాట్సాప్ చేయాల‌న్నా వైఎస్ జగన్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Next Story
Share it