అమరావతి: ట్విటర్ లో మరోసారి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రివర్స్ టెండరింగ్ పై చంద్రబాబు పదేపదే మాట్లాడటాన్ని విజయసాయి తప్పుబట్టారు. మీరు దోచుకున్నదాని గురించి మాట్లాడితే బాగుంటుందని బాబుకు విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. అంతేకాదు...వాలంటీర్లు, మహిళలపై నోరు పారేసుకుంటే..గ్యారంటీగా తండ్రీకొడుకులు చెప్పు దెబ్బలు తింటారంటూ విజయసాయి ట్విట్ చేశారు. ఇక..టీడీపీకి కొమ్ముకాసే ఓ పత్రికాధిపతిని కూడా విజయసాయి వదల్లేదు. ఆయనను 'కిరసనాయలు'అంటూ సంభోదిస్తూ..జర్నలిజం ముసుగులో విషం కక్కుతున్నాడంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి.
�