కరోనాపై పోరుకు విజయ్ భారీ విరాళం
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడం కోసం మనదేశంలో లాక్‌డౌన్ ను విధించారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమతం అయ్యారు. కరోనా నియంత్రణకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే పలు సీని, క్రీడా ప్రముఖులు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా.. తమిళ స్టార్ హీరో విజయ్ కరోనా నియంత్రణకు భారీ విరాళం ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలతో పాటు తమిళనాడుకు రూ.50 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, ఫెప్సీకి రూ.25 లక్షలు, కర్ణాటకకు రూ.5 లక్షలు, పాండిచ్చేరికి రూ.5 లక్షలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్స్ కు రూ.5 లక్షల చొప్పున ప్రకటించారు. మొత్తం రూ.1.3కోట్ల విరాళం అందజేయనున్నట్లు తెలిపారు. విరాళం ఇవ్వడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.