అజిత్ సాహ‌సం.. ఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిల్ చేయించుకుని మ‌రీ..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2020 8:09 AM GMT
అజిత్ సాహ‌సం.. ఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిల్ చేయించుకుని మ‌రీ..

త‌మిళ స్టార్ హీరో అజిత్ కు బైక్ రైడింగ్ అంటే పిచ్చి. ఎంత‌లా అంటే.. హైద‌రాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్ వేస్తే.. దానిని క్యాన్సిల్ చేయించి మ‌రీ.. 650 కిలో మీట‌ర్లు బైక్ పై ప్ర‌యాణం చేశాడ‌ట‌. అదీ ఒంట‌రిగానే. ఈ విష‌యాన్ని 'వాలిమై' చిత్ర బృందం తాజాగా తెలిపింది. మ‌ధ్య‌లో కేవ‌లం ఆహారం, పెట్రోల్ కోసం ఆగాడ‌ని వెల్ల‌డించింది. అజిత్ చేసిన రిస్క్ చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ప్ర‌స్తుతం ఈ స్టార్ హీరో హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో డైరెక్షన్ లో 'వాలిమై' చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. సినిమాలోని బైక్ చేజింగ్ స‌న్నివేశాన్ని ఇక్క‌డ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో అజిత్ ప‌వ‌ర్ పుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కాగా.. అజిత్ కోసం ప్ర‌త్యేకంగా ఓ బైక్‌ను డిజైన్ చేయించారు. ఆ బైక్ అజిత్ కు ఎంత‌గానో న‌చ్చిందట‌. హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుని అంద‌రూ తిరుగు ప్ర‌యాణానికి సిద్ద‌మ‌య్యారు. త‌న ఫ్లైట్ టికెట్ ర‌ద్దు చేయ‌మ‌ని.. బైక్ పై చెన్నైకి వ‌స్తాన‌ని అసిస్టెంట్ కు చెప్పాడ‌ట‌ అజిత్‌.

హైద‌రాబాద్ నుంచి చెన్నైకి 650కిలో మీట‌ర్ల ప్ర‌యాణం. ఈ ప్ర‌యాణం మ‌ధ్య‌లో కేవ‌లం ఆహారం, పెట్రోల్ కోసం మాత్ర‌మే ఆగాడ‌ట‌. ఇదిలా ఉండ‌గా.. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. కాగా.. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Untitled 5

వాలిమై చిత్రాన్ని బోనీ క‌పూర్ నిర్మిస్తుండ‌గా.. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ న‌టి హ్యుమా ఖురేషీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Next Story
Share it