లాక్‌డౌన్‌లో రౌడీ ఏం చేస్తున్నాడో చూడండి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2020 5:11 PM IST
లాక్‌డౌన్‌లో రౌడీ ఏం చేస్తున్నాడో చూడండి

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సినిమా షూటింగ్స్ వాయిదా ప‌డడంతో.. న‌టీన‌టులంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో 'బి ది రియ‌ల్ మ్యాన్' ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. లాక్‌డౌన్ కాలంలో ఇంట్లోని ఆడ‌వారికి సాయం చేయాల‌ని 'అర్జున్ రెడ్డి' చిత్ర ద‌ర్శ‌కుడు సందీప్ వంగా ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. ఇప్ప‌టికే టాలీవుడ్ అగ్ర‌హీరోలు చిరంజీవి, వెంక‌టేష్‌తో పాటు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కీర‌వాణి లు ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల ఈ ఛాలెంజ్‌కు హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ను నామినేట్ చేశాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన రౌడీ .. త‌నని ఇంట్లో ప‌నులు చేయ‌నివ్వ‌డం లేద‌ని, కాక‌పోతే లాక్‌డౌన్‌లో రోజువారీ జీవితానికి సంబంధించిన‌ వీడీయోను త‌ప్ప‌కుండా పోస్ట్ చేస్తాన‌ని చెప్పాడు. అన్న‌ట్లుగానే వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. లాక్‌డౌన్‌లో నా జీవితానికి సంబంధించిన ఓ చిన్ని వీడియో. ఆనంద్ దేవ‌ర‌కొండ ఈ వీడియోను రూపొందాడు. ఇప్పుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌ను నామినేట్ చేస్తున్నాని విజ‌య్ తెలిపాడు. ఇక దుల్కర్ ఈ ఛాలెంజ్‌ను ఏ రకంగా చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.



Next Story