హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకులు షామీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం నేడు రిలీజైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌చేసారు.

త‌న త‌దుప‌రి చిత్రాల గురించి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ చెబుతూ…. క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఇంకా ఎనిమిది రోజులు షూటింగ్ ఉంది. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ చేయ‌లేదు. ఈ సినిమా త‌ర్వాత‌ పురి గారితో సినిమా చేయ‌నున్నాను. ఈ సినిమా జనవరి నుండి స్టార్ట్ అవుతుంది.

ఇందులో పూరి గారి స్టైల్ లో స‌రికొత్త‌గా క‌నిపిస్తాను. యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యే సినిమా. మంచి పేరు తీసుకువ‌స్తుంది. ఈ సినిమా త‌ర్వాత నిన్నుకోరి, మ‌జిలీ చిత్రాల ద‌ర్శ‌కుడు శివ నిర్వాణతో ఒక సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా గురించి పూర్తి వివ‌రాల‌ను త‌ర్వాత చెబుతాను అన్నారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.