సూసైడ్ నోట్ రాసి.. తన చావు ఖర్చులకు తానే డబ్బులిచ్చుకొని..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 11:19 AM GMT
సూసైడ్ నోట్ రాసి.. తన చావు ఖర్చులకు తానే డబ్బులిచ్చుకొని..

హైద్రాబాద్ కు చెందిన విజయ్ ఒక అనాధ, క్యాబ్ డ్రైవర్ గా జీవితం సాగిస్తున్నాడు. జీవితం మీద విరక్తి చెందడంతో నిన్న రాత్రి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే సంస్థ అయిన సెర్వ్ నీడి గురించి తెలుసుకున్నాడు.

క్యాబ్ డ్రైవర్ గా తాను సంపాదించిన 6000 రూపాయలను సెర్వ్ నీడి సంస్థ వాళ్లను కలిసి అందజేశాడు. మీకు అనాధ శవం దొరికితే ఈ డబ్బులను వినియోగించండి అని వెళ్ళిపోయాడు. ఇక తన శవం ఎలాగూ వీళ్లకే దొరుకుతుంది కదా అని, అనాధ అయిన తనకు అంత్యక్రియలను వారే నిర్వహిస్తారని లెటర్ రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు.

విషయం ఏమిటంటే.. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని.. ఆ సంస్థకు చెప్పకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. విధి ఎంత విచిత్రమైందంటే.. ఈ రోజు పంజాగుట్టలో విజయ్ శవానికి.. అతడెవరో తెల్వకుండానే సర్వ్ నీడి సంస్థ అంత్యక్రియలను నిర్వహించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Next Story