షాకిచ్చిన లేడి కమెడియన్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 10:34 AM GMT
షాకిచ్చిన లేడి కమెడియన్‌..

కరోనా ముప్పుతో సినిమా షూటింగ్స్‌ వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం అయ్యారు సినిమా నటులు. తమకు దొరికిన విరామాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉపయోగించుకుంటున్నారు. తమ ఫిట్నెస్ను పెంపొందించుకునేందుకు ఈ లాక్‌డౌన్‌ కాలాన్ని చాలా మంది ఉపయోగించుకున్నారు. తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో లేడి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి విద్యుల్లేఖ రామన్‌. బొద్దుగా ఉండే విద్యుల్లేఖ తనదైన కామెడి టైమింగ్‌తో అందరిని నవ్విస్తోంది.

ఇప్పుడు విద్యుల్లేఖను చూసిన వారు ఎవరు అయిన ఫస్ట్‌ టైంలో ఆమె అంటే నమ్మడం కష్టం. అంతలా మారిపోయింది. అసాధారణ రీతిలో బరువు తగ్గింది. ప్రస్తుత ఉన్న హీరోయిన్ల లాగా చాలా స్లిమ్‌ గా మారి నెటీజన్లకు షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫేక్‌ నమ్మకానికి.. నిజమైన నమ్మకానికి చాలా తేడా ఉంది అని పేర్కొంది. నేను అధిక బరువుతో ఉన్నప్పుడు చాలా మంది మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు అని అడిగేవారు. అప్పుడు నా ఆత్మ విశ్వాసంపై నాకే అనుమానం కలిగేది. కానీ ఇప్పుడు మాత్రం నా మీద నేను పూర్తి నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఊహించని విధంగా నా జీవనశైలి, అలవాట్లను మార్చుకోగలిగాను. మీరు చేయాలని అనుకున్న దానిపై మనసు పెడితే ఏదైనా సాధించవచ్చని గ్రహించాను బరువు తగ్గడానికి ఎటువంటివ రహస్యాలు, మందులు అవసరం లేదు. శారీరక శ్రమ చాలు, మన కష్టం, కన్నీరు తగ్గ ప్రతిఫలం లభిస్తుందని, జూన్‌ 20 నాటికి 68.2 కిలోల బరువు ఉన్నానని విద్యుల్లేఖ వెల్లడించారు.

తమిళ నటుడు మోహన్‌ రామన్‌ కుమార్తె అయిన విద్యుల్లేఖ.. చెన్నైలో పుట్టిపెరిగారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన విద్యుల్లేఖ.. 'రన్‌ రాజా రన్‌', 'రాజుగారి గది', 'సరైనోడు','నిన్ను కోరి' వంటి చిత్రాల్లో నటించింది లేడి స్టార్‌ కమెడియన్‌ గా రాణిస్తోంది.

Next Story