పులి పంజా విసిరినా బెదరని బుడతడు
By రాణి Published on 26 Dec 2019 4:52 PM ISTహైదరాబాద్ : ఆ బాలుడి వయసు సుమారు ఏడేళ్లుంటాయేమో. అతని ఓ పులి ఉన్నట్లుండి పంజా విసిరింది. పులి పంజా విసిరినా ఆ బుడతడు బెదరకపోగా నవ్వుతూ ఉన్నాడు. అదేంటి. పులి పంజా విసిరినా బెదరకపోవడం ఏంటా అనుకుంటున్నారా ? ఇదంతా జరిగింది ఓ జూపార్క్ లో. ఐర్లాండ్ కు చెందిన షాన్ కాస్టెల్లో అనే చిన్నోడు తన తండ్రితో కలిసి 23న జూపార్క్ కు వెళ్లాడు. జూ ను సందర్శిస్తూ ఉండగా..పులి హఠాత్తుగా పరుగెత్తుకొచ్చి బుడతడిపై పంజా విసిరింది. అయితే అక్కడొక మందమైన గాజు గ్లాజు అడ్డుగా ఉండటంతో ఆ చిన్నోడికి ఏమీ కాలేదు. పైగా పులి పంజా విసురుతుంటే కాస్టెల్లో మాత్రం నవ్వుతూ..చిందులేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. పులి తన కొడుకుపై పంజా విసురుతున్న ఫొటోని కాస్టెల్లో తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో పోస్ట్ చేశాక మరొకరు కూడా అలాంటి వీడియోనే పోస్ట్ చేశారు. తమ పిల్లలు, ఇరుగు పొరుగు వారితో కలిసి జూ పార్క్ కి వెళ్లినపుడు కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, ఆ అనుభవాన్ని ఇంకా మరిచిపోలేదని చెప్తూ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.