ఊహించని రీతిలో భారీ వర్షాలు రావడంతో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్నడూ లేనంత భారీ వర్షాన్ని హైదరాబాద్ వాసులు చూశారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఈ వరదలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కూడా వరద నీరు వచ్చి చేరిందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వైరల్ వీడియోలో నిజమెంతో తెలియజేయాలని కోరుతూ న్యూస్ మీటర్ కు రిక్వెస్ట్ అందింది.నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియో హైదరాబాద్ కు చెందినది కాదు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(ఆర్.జి.ఐ.ఏ.) అధికారులు కూడా ఈ విషయాన్నే ధృవీకరించారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వర్షపు నీరు వచ్చి చేరాయంటూ వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అని చెబుతూ అధికారిక ఖాతాలో పోస్టు పెట్టారు. “It has been noticed many fake videos of waterlogging at RIGA are in circulation. Please be informed that operations at your airport are normal. Your airport is #SafeToFly, and you can reach out to our information desk at any given time or text us on social media platforms for assistance.” అంటూ చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చాలా ఫేక్ వీడియోల ద్వారా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నీరు వచ్చి చేరిందని ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మకండి అని తెలిపారు. విమానాశ్రయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని.. విమాన ప్రయాణాలకు ఆమోదయోగ్యంగా ఉందని ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు. ఏవైనా సందేహాలు ఉంటే ఇన్ఫర్మేషన్ డెస్క్ కు కాల్ చేయాలని సూచించారు.

వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో 2017 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. ఆగష్టు 31, 2017 నుండి వీడియోను పలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు, పలు మీడియా సంస్థలు కూడా ఈ వీడియోకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. మెక్సికో దేశానికి సంబంధించిన బెనిటో జువారెజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చెందిన వీడియో అది.Reporteindigo కూడా ఆగష్టు 31, 2017న వీడియోను పోస్టు చేస్తూ మెక్సికోకు చెందిన నగరంలో ఎయిర్ పోర్టు లోకి నీరు వచ్చి చేరిందని స్పష్టం చేసింది.

అదే రోజున మెక్సికో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ట్విట్టర్ హ్యాండిల్ లో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని.. వాతావరణం అనుకూలించిన తర్వాత సర్వీసులను కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు.2017 సంవత్సరం నుండి ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. చాలా నగరాలలో వర్షాలు కురవగానే ఆ నగరంలో ఎయిర్ పోర్టు పరిస్థితి ఇది అంటూ వీడియోను వైరల్ చేస్తూ వస్తున్నారు. ముంబై, బెంగళూరు, మియామీ ఎయిర్ పోర్టుల్లో ఇలాంటి పరిస్థితి నెలకొందని గతంలో ఇదే వీడియోను వైరల్ చేశారు.

ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా వరదనీరు వచ్చి చేరిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

Claim Review :   Fact Check : హైదరాబాద్ ఎయిర్ పోర్టు లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరిందా..?
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story