వయాగ్రా.. ఎక్కువ వాడారో..
By అంజి Published on 9 Feb 2020 2:42 AM GMTవయాగ్రా.. ఎందుకు వాడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని ఎలా పడితే అలా తీసుకోవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అంటున్నారు వైద్యులు. ఎక్కువ డోస్ వయాగ్రా వాడడం మూలాన లైట్ సెన్సిటివిటీ, రంగులు సరిగా చూడలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మగవాళ్ళలో చాలా అరుదుగా వస్తూ ఉంటాయని.. మొదటిసారి వాడే వారు ఒక్క సారిగా ఎక్కువ డోస్ వాడకుండా.. కాస్త తక్కువ డోస్ తీసుకుంటేనే మంచిదని చెబుతున్నారు.
సిల్డెనాఫిల్ ను సాధారణంగా వయాగ్రా అని అంటారు.. వీటిని పటుత్వం కోసం వాడతారు. ఫ్రాన్టీర్స్ ఇన్ న్యూరాలజీ చేసిన తాజా స్టడీలో ఎక్కువ మంది దృష్టి పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. చాలా మంది ప్రిస్క్రిప్షన్ లేకుండా సిల్డెనాఫిల్ ను వాడుతున్నారని అందుకే సమస్యలు అన్నది తలెత్తుతున్నాయని టర్కీకి చెందిన డాక్టర్ కరార్స్లాన్ తెలిపారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగానూ కొద్ది సేపు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. సిల్డెనాఫిల్ ను లైంగిక సంబంధాలను బలంగా ఉంచుకోడానికి మగవాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 1998 నుండి సిల్డెనాఫిల్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. సిల్డెనాఫిల్ ను వాడితే 3-5 గంటల పాటూ దాని ప్రభావం మగవారిలో ఉంటుంది.
సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్దిసేపటికి మాయమవుతాయని డాక్టర్ కరార్స్లాన్ తెలిపారు. తమ ఆసుపత్రికి 17 మంది మగవాళ్ళు వచ్చారని వారంతా తమకు కళ్ళు కాస్త మసకగా కనిపిస్తున్నాయని చెప్పారని, లైట్ సెన్సిటివిటీ అన్నది కూడా వారిలో గమనించామని, ముఖ్యంగా రంగుల విషయంలో చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చాయని తమతో వారు అన్నారని డాక్టర్ కరార్స్లాన్ చెప్పుకొచ్చారు. ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఎరుపు, ఆకుపచ్చ రంగులను గుర్తించడంలో వారు ఇబ్బంది పడ్డట్లు డాక్టర్ కరార్స్లాన్ చెప్పారు. ఆ 17 మంది సిల్డెనాఫిల్ ను మొదటిసారి ఎక్కువ డోస్(100ఎం.జి.) తీసుకున్నారని అందుకే వారికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని అన్నారు. వారికి ఎటువంటి మందులు అవసరం లేదని.. వారికి మిగతా కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి పంపించేశామని అన్నారు. వయాగ్రా అన్నది వైద్యులు చెప్పినంత డోస్ తీసుకుంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటున్నారు.