నాథూరాం గాడ్సే దేశ భ‌క్తుడంటూ ట్వీట్ చేసిన సినీ న‌టుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ వి. హ‌నుమంత రావు(వీహెచ్‌) ఫైర‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న మాట్లాడిన‌ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. వీహెచ్ మాట్లాడుతూ.. గాంధీని చంపిన గాడ్సేకు నాగ‌బాబు మంచివాడ‌నే టైటిల్ ఇస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. ఎన్నో ఏళ్లుగా సినీ జీవితంలో ఉన్న నాగ‌బాబు.. ఈ మ‌ధ్య రాజ‌కీయాల్లోకి రాగానే..‌ నాథూరాం గాడ్సే మంచివాడు అ‌న‌టం త‌గ‌ద‌న్నారు.

యావ‌త్తు భార‌త‌వ‌నిని ఎటువంటి ఆయుధం లేకుండా స్వాతంత్ర్య సంగ్రామంలో ముందుకు న‌డిపిన జాతిపిత మ‌హ‌త్మా గాంధీని చంపిన వాడిని మంచివాడ‌న‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నించారు. నాగబాబు ఎందుకు ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది.. ఆయ‌న‌ ఆర్ఎస్ఎస్ ఆలోచ‌న‌లను ఇంప్లిమెంట్ చేస్తున్నారేమోనన్న అనుమానం వ‌స్తుంద‌ని అన్నారు. ఇలాంటి వ్యాఖ్య‌ల ద్వారా ప్ర‌జ‌ల‌లో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని.. ఆ రోజుల‌లో ఆయ‌న గురించి మీడియా రాసింద‌ని మీడియాను త‌ప్పుబ‌ట్ట‌డం మంచిది కాదు. ఇప్పటికైనా నాగ‌బాబు ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాలని అన్నారు.
ప్ర‌పంచ దేశాలు మ‌హాత్మా గాంధీ జ‌న్మ‌దినాన్ని నాన్ వ‌యోలెన్ప్ డే గా ప‌రిగ‌ణించే క్ర‌మంలో.. ఓ సినీన‌టుడు, కొత్త‌గా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన వ్య‌క్తి.. మ‌హాత్మా గాంధీనే కాదు.. ప్ర‌తి భార‌తీయుడిని అవ‌మానించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఇప్ప‌టికైనా నాగ‌బాబు ఇటువంటి వ్యాఖ్య‌లు మానుకోవాల‌ని.. లేని ప‌క్షంలో ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *