వెటర్నరీ వైద్యురాలిని హత్య చేసింది వీరే...!
By Newsmeter.Network Published on 29 Nov 2019 4:35 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను, టోల్ ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరుని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
లారీ నెంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ లారీ రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన లారీగా గుర్తించారు. నిందితులంతా నారాయణపేట జిల్లా, జక్లేర్ మండలం, మక్తల్‌కు చెందినవారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డది జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట్ల చెన్నకేశవులు, మహ్మద్ పాషా లుగా పోలీసులు గుర్తించారు.
లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా వైద్యురాలు తన చెల్లితో మాట్లాడిన సమయంలో ఆ ప్రాంతంలోని ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశారని, ఆ సమయంలో నిందితుల ఫోన్ కాల్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే వారి కాల్‌డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు సమాచారం.