మద్యం తాగించి మరీ.. మృతదేహంపై.. అంత్యంత దారుణంగా..

 Published on  30 Nov 2019 6:53 AM GMT
మద్యం తాగించి మరీ.. మృతదేహంపై.. అంత్యంత దారుణంగా..

హైదరాబాద్‌: శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ పై అఘాయిత్యం కేసులో విభిన్న కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దుర్మార్గులు ఆమెపై అఘాయిత్యం చేసే క్రమంలో అంత్యంత దారుణంగా ప్రవర్తించారు. బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రతిఘటించకుండా వైద్యురాలి నోరు, ముక్కును గుడ్డతో మూయడంతో అప్పటికే ఆమె మృతి చెందింది. అయినా.. ఆ దుర్మార్గులు మృతదేహంపైనా అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో ఆమె కుటుంబసభ్యులతో పాటు పోలీసులు దిగ్భ్రాంతి చెందారు.

Veterinary Doctor Murder

అయితే వైద్యురాలిపై దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం ఆమె మృతదేహాన్ని లారీ క్యాబిన్‌లోకి ఎక్కించారు. ఆ సమయంలో మృతదేహానికి ప్యాంటు లేదు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు ప్యాంటు తొడిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అంతటితో ఆగకుండా నిందితులు మార్గ మధ్యలో పలుమార్లు ఆమెపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఘటనాస్థలంలో పోలీసులు మృతురాలి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు నిందితుల్లో ఓ మైనర్ ఉన్నట్లు ముందుగా ప్రచారం జరిగినా.. అందరూ 20ఏళ్లకు పైబడిన వారేనని పోలీసులు స్పష్టం చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది. అయితే నిందుతులకు శిక్ష పడేలా చేయాలని.. అప్పుడే తన కూమార్తె ఆత్మ శాంతిస్తుందని మృతురాలి తండ్రి కోరుతున్నారు.

Next Story
Share it