వెటర్నరీ డాక్టర్ హత్య కేసులో నిందితుల రిమాండ్‌

By Newsmeter.Network  Published on  30 Nov 2019 5:24 PM IST
వెటర్నరీ డాక్టర్ హత్య కేసులో నిందితుల రిమాండ్‌

హైదరాబాద్‌: వెటర్నరీ డాక్టర్ హత్య కేసులో నిందితులకు14 రోజుల రిమాండ్ విధించారు. తాజాగా ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసిన షాద్‌నగర్‌ పోలీసులు వారిని మేజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట హాజరుపర్చారు.

అయితే వైద్యురాలి హత్యపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఉద్రిక్తత కొనసాగుతుంది. వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో.. నిందితులను బయటకు తీసుకురావడం సురక్షితం కాదని పోలీసులు భావించారు. ఈ మేరకు నిందితులకు వైద్య పరీక్షలు కూడా పోలీస్‌ స్టేషన్‌లోనే నిర్వహించారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌లోనే మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ విచారించారు. అనంతరం వారికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చంచల్‌గుడ సెంట్రల్ జైలుకు తరలించారు.

Next Story