వేణుమాధ‌వ్ మ‌ర‌ణం ఇండస్ట్రీకి తీర‌ని లోటు :  శ్రీకాంత్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 12:22 PM GMT
వేణుమాధ‌వ్ మ‌ర‌ణం ఇండస్ట్రీకి తీర‌ని లోటు :  శ్రీకాంత్

ప్ర‌ముఖ హాస్య న‌టుడు వేణుమాధ‌వ్ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. హీరో శ్రీకాంత్ స్పందిస్తూ... మేమిద్దరం చాలా సినిమాలు కలిసి యాక్ట్ చేశాం. న‌టుడిగా, క‌మెడియ‌న్‌గా సినీ రంగ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు వేణుమాధ‌వ్‌. ఈరోజు ఆయ‌న ఆకాల మ‌ర‌ణం ఎంతో బాధాక‌రం. ఆయ‌న మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం తీర‌ని లోటు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానున‌భూతిని వ్య‌క్తం చేస్తున్నాం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అన్నారు.

వేణుమాధ‌వ్ లేర‌నే వార్త ఎంత‌గానో బాధించింది - డైరెక్ట‌ర్ ఎన్. శంక‌ర్

వేణుమాధవ్ భౌతికంగా లేరనే వార్త నన్ను ఎంతగానో బాధపెట్టింది అని ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు ఎన్. శంక‌ర్ తెలియ‌చేసారు. తెలుగు సినిమా వినోదాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి హాస్యనటుడిగా శిఖరాగ్రస్థాయికి చేరుకున్నారు. ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు అని ఆయ‌న చెప్పారు. వేణుమాధవ్ నా సినిమాలన్నింటిలో నటించాడు. మా ఇద్దరిది ఒకే జిల్లా. ఎంతో ఆత్మీయంగా ఉండేవాడు. అద్భుతమైన హాస్యనటుడిగా వెలుగొందిన వేణుమాధవ్ మరణం సినీ పరిశ్రమకు, మిత్రులకు, నాలాంటి సన్నిహితులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ నుభూతిని తెలియజేస్తున్నాను అని తెలుగు ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు ఎన్.శంక‌ర్ అన్నారు.

Next Story
Share it