అంద‌రినీ న‌వ్వించిన వేణుమాధ‌వ్ ఇక లేరు అనే విష‌యం తనను దిగ్బ్రాంతి లోను చేసింద‌ని సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందిస్తూ... కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వేణుమాధ‌వ్ కోలుకుంటారు అనుకున్నాను. న‌టుడిగా ఎంతో భ‌విష్య‌త్ ఉన్న ఆయ‌న మ‌ర‌ణించ‌డం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో క‌లిసి ప‌లు చిత్రాల్లో న‌టించారు.

హాస్యం పండించ‌డంలో మంచి టైమింగ్ ఉన్న న‌టుడు. మిమిక్రిలో కూడా నైపుణ్యం ఉండ‌టంతో సెట్లో అంద‌రినీ స‌ర‌దాగా ఉంచేవారు. వ‌ర్త‌మాన రాజ‌కీయ విష‌యాలపై ఆస‌క్తి చూపేవారు. వేణుమాధ‌వ్ మృతికి నా త‌రుపున‌, జ‌న‌సైనికుల త‌రుపున వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌చేస్తున్నాను. వేణుమాధ‌వ్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story