వెంకీమామ టైటిల్ పెట్టింది ఎవ‌రు..?

By Newsmeter.Network  Published on  7 Dec 2019 8:13 AM GMT
వెంకీమామ టైటిల్ పెట్టింది ఎవ‌రు..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ సామ్రాట్ నాగ చైత‌న్యల కాంబినేష‌న్ లో రూపొందిన భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. ఈ క్రేజీ మూవీకి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఈ చిత్ర విశేషాల‌ను ద‌ర్శ‌కుడు బాబీ మీడియాతో పంచుకున్నారు. అయితే... ఈ చిత్రానికి వెంకీమామ అనే టైటిల్ ఎవ‌రు పెట్టారు అని బాబీని అడిగితే ఆయ‌న చెప్పిన స‌మాధానం... ఓరోజు సురేష్‌ సర్‌ ఫోన్‌ చేసి పేరు గురించి ఏం ఆలోచించావు అన్నారు. ఇంకా ఏం అనుకోలేదన్నా. సరే.. ‘‘వెంకీమామ’ ఎలా ఉంది? చైతూ ఎప్పుడూ వెంకటేష్‌ను అలాగే పిలుస్తుంటాడు.

ఈ పేరు ఓకేనా అని అడిగార‌ట సురేష్ బాబు. ఆ పేరులోనే కథ ఉంది. సినిమాలోని విషయాన్ని ఉన్నదున్నట్లు చెప్పేస్తుంది. మరో ఆలోచన లేకుండా ఇదే పెట్టేద్దాం సర్ అని బాబీ చెప్పాడ‌ట‌. ఈ విధంగా ఈ చిత్రానికి వెంకీ మామ అనే టైటిల్ ను సురేష్ బాబే పెట్టార‌ని బాబీ చెప్పారు.

Next Story