'వెంకీ మామ' బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నాడు..!

By అంజి  Published on  16 Dec 2019 4:25 AM GMT
వెంకీ మామ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నాడు..!

'వెంకీ మామ'కి వచ్చిన టాక్ కి.. 'వెంకీ మామ' సాధిస్తోన్న కలెక్షన్స్ కి సంబంధం లేకుండా పోతుంది. క్రిటిక్స్ అందరూ 'వెంకీ మామ'ని తక్కువగానే అంచనా వేశారు. చాలమంది ఏవరేజ్ సినిమాకి కాస్త తక్కువే అన్నట్లు రివ్యూలు ఇచ్చారు. కానీ 'వెంకీ - చైతు' బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నారు. ఇద్దరికీ ఈ సినిమాతోనే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రెండు రోజులకు వచినట్లుగానే మూడో రోజు అయిన ఆదివారం నాడు కూడా ఈ చిత్రం రూ .5 కోట్ల ప్లస్ షేర్‌ ను కలెక్ట్ చేసింది. బి.సి సెంటర్స్ లో అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని 'ఏ' కేంద్రాలలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మొత్తం 3 రోజుల్లో రూ . 17.78 కోట్ల మార్క్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ .45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ మేరకు మేకర్స్ కూడా అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.

బాబీ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలయికలో వచ్చిన ఈ ఎమోషనల్ మల్టీస్టారర్.. మంచి ఫన్ తో సాగుతూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షుకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. దాంతో వెంకీ - చైతు అభిమానులతో పాటు ప్రేక్షుకులు కూడా 'వెంకీ మామ'ను బాగా ఆదరిస్తున్నారు. సోమవారం నాడు కూడా కొన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ అయ్యే అవకాశం ఉందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. అదే నిజం అయితే 'వెంకీ మామ' ఫుల్ లాభాల్లో పడినట్లే.

'వెంకీ మామ' ఇప్పటివరకూ ఆంధ్ర అండ్ తెలంగాణలో సాధించిన కలెక్షన్స్ ను షేర్ వివరాలను ఏరియాల వారిగా పరిశీలిస్తే..

సీడెడ్ - 3.39 కోట్లు

నైజాం - 6.72 కోట్లు

నెల్లూరు - - 0.64 కోట్లు

ఈస్ట్ - 1.43 కోట్లు

వెస్ట్ - 0.81 కోట్లు

ఉత్తరాంధ్ర - 2.25 కోట్లు

కృష్ణ - 1.04 కోట్లు

గుంటూరు - 1.50 కోట్లు

ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏరియాలను కలుపుకుని మొత్తం మూడు రోజుల కలెక్షన్ల షేర్ : 17.78 కోట్లు, గ్రాస్ రూ .45 కోట్లు.

Next Story
Share it