ఖమ్మంలో... వెంకీమామ
By Newsmeter.Network Published on 7 Dec 2019 3:58 PM IST
విక్టరీ వెంకటేష్ - యువ సమ్రాట్ నాగ చైతన్యల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన భారీ మల్టీస్టారర్ వెంకీమామ. జై లవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి ఈ సినిమాని నిర్మించింది. వెంకీ సరసన పాయల్ రాజ్ ఫుత్, చైతు సరసన రాశీఖన్నా నటించారు. ఈ ప్రెస్టేజీయస్ మూవీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 13న రిలీజ్ అవుతుంది.
ఈ రోజు వెంకీ మామ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో వెంకటేష్, నాగ చైతన్య, పాయల్ రాజ్ ఫుత్, రాశీఖన్నా, డైరెక్టర్ బాబీ, నిర్మాత సురేష్ బాబు.. తదితరలు పాల్గొంటారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియో నుంచి బస్సులో వెంకీమామ టీమ్ ఖమ్మం బయలుదేరారు.
సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెంకీమామ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఎప్పుడెప్పుడా అని అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి.. ఈ భారీ, క్రేజీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో..?