'వెంకీ మామ'‌.. రిలీజ్ డేట్ మారిందా..?

By Newsmeter.Network  Published on  28 Nov 2019 10:34 AM GMT
వెంకీ మామ‌.. రిలీజ్ డేట్ మారిందా..?

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం వెంకీమామ‌. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఏ ముహుర్తాన స్టార్ట్ చేసారో కానీ.. రిలీజ్ ఎప్పుడు అనేది ఓ స‌స్పెన్స్ గా మారింది. అస‌లు ఈ సినిమాని ద‌స‌రాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి రిలీజ్ ఉండ‌డంతో 'వెంకీ మామ' వాయిదా వేశారు.

ఆ త‌ర్వాత దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ.. ఈ సినిమాకి బ‌డ్జెట్ బాగా పెర‌గ‌డం వ‌ల‌న దీపావ‌ళి సీజ‌న్ లో రిలీజ్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌నుకున్నారు. ఇక డిసెంబ‌ర్ లో రిలీజ్ చేస్తారు అనుకుంటే.. చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన సురేష్ బాబు సంక్రాంతికి రిలీజ్ చేస్తే క‌లెక్ష‌న్స్ బాగుంటాయి అని ఆలోచిస్తున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి.

దీంతో సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న చిత్ర‌ నిర్మాత‌లు, హీరోలు, ద‌ర్శ‌కులు 'వెంకీ మామ' పోటీకి వ‌స్తుంద‌ని తెగ టెన్ష‌న్ ప‌డ్డారు. ఈమ‌ధ్య తెలిసింది ఏంటంటే... వెంకీ మామ సంక్రాంతికి కాదు డిసెంబ‌ర్ లోనే రిలీజ్ కానుంద‌ని.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... విక్టరీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న వెంకీ మామ రిలీజ్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. తాజా వార్త ఏంటంటే... క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న వెంకీ మామ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకుంటున్నారని సమాచారం. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి.. డిసెంబ‌ర్ 25న అయినా రిలీజ్ చేస్తారో .. మ‌ళ్లీ వాయిదా వేస్తారో..? చూడాలి మరీ.

Next Story
Share it