వెంకీమామ ప్రీ రిలీజ్, రిలీజ్ ఎప్పుడు..?

By Newsmeter.Network  Published on  27 Nov 2019 6:26 AM GMT
వెంకీమామ ప్రీ రిలీజ్, రిలీజ్ ఎప్పుడు..?

'వెంకీ మామ‌'.. ఈ మ‌ధ్య కాలంలో బాగా వార్త‌ల్లో నిలిచిన సినిమా ఇది. కార‌ణం ఏంటంటే... ఈ సినిమా సంక్రాంతికి వ‌స్తుంది అంటూ వార్త‌లు రావ‌డంతో సంక్రాంతి పోటీలో ఉన్నసినిమా హీరోలు, నిర్మాత‌లు బాగా టెన్ష‌న్ ప‌డ్డారు. ఆ త‌ర్వాత 'వెంకీ మామ‌' సంక్రాంతికి రావ‌డం లేదు.. డిసెంబ‌ర్లో వ‌స్తుంద‌ని తేల‌డంతో హ‌మ్మ‌య్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ 'వెంకీ మామ‌'‌. ఈ చిత్రానికి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్ ఫుట్, చైత‌న్య స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే... ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌లేదు. కానీ.. డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 1న గ్రాండ్ గా వ‌రంగ‌ల్ లో చేయాల‌నుకుంటున్నార‌ని సమాచారం. మేన‌మామ‌, మేన‌ల్లుడు క‌లిసి న‌టించిన ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అక్కినేని అభిమానులు - ద‌గ్గుబాటి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తితో ఎదురు చూస్తోన్న వెంకీ మామ ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో...? వేచి చూడాలి మరీ.

Next Story