మిస్‌యూ 'వెంకీమామా'
By తోట వంశీ కుమార్ Published on 21 Sep 2020 10:33 AM GMT
కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) యూఏఈ వేదికగా జరుగుతోంది. రెండు మ్యాచ్‌లే జరిగినప్పటికి అభిమానులకు అసలు సిసలు మజా అందిస్తోంది. దుబాయ్ వేదికగా ఈ రోజు సాయంత్రం 7.30గంలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. బ్యాట్‌కి బంతికి మధ్య జరగనున్న ఆసక్తికర సమరం కోసం అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
ఇక హైదరాబాద్ ఈరోజు మొదటి మ్యాచ్ ఆడుతుండడంతో మద్దతు తెలుపుతూ.. అభిమానులతో పాటు సెలబ్రెటీలు విషెస్ చేస్తున్నారు. హీరో విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. 'ఆల్ దిబెస్ట్ SRH... నేను మిమ్మల్ని ఇంట్లోనే ఉండి ఉత్సాహపరుస్తాను' అని వెంకీ ట్వీట్ చేశాడు. వెంకీ చేసిన ట్వీట్‌కి ఆరెంజ్ ఆర్మీ కూడా బదులు ఇచ్చింది. 'స్టాండ్స్‌లో ఉండి ప్రోత్సహించే మిమ్మల్ని మేం మిస్సవుతాం వెంకీమామా' అని రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. వెంకటేష్‌కి క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఉప్పల్ లో ఎప్పుడు మ్యాచ్ ఆడినా గ్రౌండ్‌కు వచ్చి హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం యూఏఈలో టోర్నీ జరుగుతుండడంతో.. అక్కడికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో వెంకీ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశాడు.
ఇక ఐపీఎల్ చరిత్రలో ఈ ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ జట్లు 15 సార్లు తలపడగా.. 8-6తో సన్‌రైజర్స్ లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఎస్‌ఆర్‌హెచ్ బావిస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపవచ్చు. తొలుత బౌలింగ్ అనుకూలిస్తూ.. తర్వాత బ్యాటింగ్‌కు సులువయ్యే పరిస్థితులుంటాయి.