అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగస్టార్ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే.  దీనిపై  టాలీవుడ్, పొలిటికల్ టౌన్ లో మాటలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. సీఎం వైఎస్ జగన్,  ‘సైరా’ చిరంజీవి  కలయికపై సంచలన దర్శకుడు వర్మ ట్విట్ చేశాడు. WOWWWWWW…..151 with 151 అంటూ ట్విట్ చేశాడు. దీని అర్ధం అందరికీ సులభంగానే అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 151 అసెంబ్లీ సీట్లు గెల్చుకుని అధికారంలోకి వచ్చింది . చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహరెడ్డి’. సో..వర్మ తనదైలిలో స్పందించారు అన్నమాట.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.