'గే' గా మారాలనుకుంటున్న వర్మ
By తోట వంశీ కుమార్ Published on 20 May 2020 12:42 PM ISTనిత్యం వివాదాలతో సావాసం చేస్తుంటాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. రోజు ఏదో ఒకటి పోస్టు చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు అలవాటు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం సర్‌ప్రైజ్ ఇస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. అయితే చిత్రబృందం ఎలాంటి వీడియోలు విడుదల చేయడం లేదని చెప్పడంతో అభిమానులు నిరాశ చెందారు. టీజర్ రాకపోయినా కూడా సర్‌ప్రైజ్ ఇస్తానని ఎన్టీఆర్ పర్సనల్ జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ చెప్పాడు. అన్నట్లుగానే నిన్న సాయంత్రం లాయిడ్ దిమ్మతిరిగే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు చూడని ఎన్టీఆర్ ఫర్ ఫెక్ట్ సిక్స్ ప్యాక్ చూపించాడు. ఈ ఫోటోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేశాడు. ఈ సినిమాలో స్టార్టింగ్‌లో వచ్చే యాక్షన్ సీన్‌లో ఎన్టీఆర్ షర్ట్ లేకుండా కనిపించాడు. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ సిక్స్ బాడీతో బాలీవుడ్ ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబూ రత్నానితో ఓ ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోకు సంబంధించిన ఫోటోనే నిన్న రిలీజ్ చేశాడు.
తాజాగా ఈ ఫోటోపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. "హేయ్ తారక్ నేను గే కాదన్న విషయం నీకు తెలుసు. కానీ ఇప్పుడు నీ ఫోటో చూస్తుంటే నాకు గే కావాలన్న కోరిక కలుగుతోంది. ఆబాడీ ఏంట్రా నాయనా "అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్ వైరల్‌గా మారింది.