కొలంబియాలో వెరైటీగా లాక్‌ డౌన్‌.. ఆ నెంబర్లు వారే బయటకు రావాలి

By Newsmeter.Network  Published on  6 April 2020 8:22 AM GMT
కొలంబియాలో వెరైటీగా లాక్‌ డౌన్‌.. ఆ నెంబర్లు వారే బయటకు రావాలి

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ దాటికి అగ్రదేశాలుసైతం అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీ, చైనా వంటి దేశాలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించారు. అదేవిధంగా భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తి వేగమవుతుంది. గత వారం రోజుల నుండి కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం.. ఈ నెల 14 వరకు కొనసాగించనుంది. ఇలా అన్ని దేశాలు లాక్‌డౌన్‌లను విధిస్తూ ప్రజలు బయటకు రాకుండా, తద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే కోవలో కొలంబియా దేశంలో కూడా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది.

Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…

కానీ అక్కడ వెరైటీ లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ప్రజలకు బయటకు వచ్చే అవకాశం కల్పించిన ఆదేశం.. ప్రభుత్వం సూచించిన నెంబర్ల ప్రకారమే బయటకు రావాల్సి ఉంటుంది. అదేమంటే.. కొలంబియా జాతీయ గుర్తింపు కార్డులోని చివరి సంఖ్యల ఆధారంగా బయటకు వెళ్లేందుకు నిబంధనలు పెట్టింది అక్కడి ప్రభుత్వం. గుర్తింపు కార్డులో 0,7,4 ఉంటే వాళ్లు సోమవారం రోజున బయటకు రావొచ్చు. అదీకూడా అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో మాత్రమే రావాలి. అదేవిధంగా 1,8,5 సంఖ్యలు ఉన్న వాళ్లు మంగళవారం రోజున బయటకు వెళ్లేలా నిబంధనలు పెట్టింది. అందరూ ఒకేసారి బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశం ప్రకటించింది. కొలంబియాలోనూ ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. ప్రస్తుతానికి అక్కడ 1500 మంది కరోనా పాజిటివ్‌ రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకుంది.

Also Read :లాక్‌డౌన్‌ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?

Next Story