వరవరరావుకు కరోనా పాజిటివ్
By తోట వంశీ కుమార్
ప్రముఖ కవి, సాహితీవేత్త, సామాజిక కార్యకర్త వరవరరావు కరోనా మహమ్మారి బారీన పడ్డారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వరవరరావు వయసు 79 సంవత్సరాలు. భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్‌ఐఏ అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
అయితే నిన్నటి నుండి మైకంగా ఉందని వరవరరావు చెబుతున్న కారణంగా ఆయన్ను జెజె ఆసుపత్రికి తరలించి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొంత కాలంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదని, జైల్లోనే ఆయన్ను ఉంచవద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బెయిల్ కోసమే ఇదంతా చేస్తున్నారని అనుకుని పోలీసులు కావాలనే ఆసుపత్రికి తరలించట్లేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే నిన్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రికి తరలించి టెస్టులు చేయగా కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. మరోవైపు తాత్కాలిక బెయిల్ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.