హైదరాబాద్‌లో అమ్మాయిలతో భర్త రాసలీలలు.. పోలీసులకు పట్టించిన భార్య!

By సుభాష్  Published on  9 May 2020 1:05 PM GMT
హైదరాబాద్‌లో అమ్మాయిలతో భర్త రాసలీలలు.. పోలీసులకు పట్టించిన భార్య!

హైదరాబాద్‌ లాడ్జిలు, వ్యభిచార గృహాలకు అడ్డాగా మారుతోంది. నగరంలో పలు సెక్స్‌ రాకెట్ల మూఠాలను పోలీసులు గుట్టురట్టు చేస్తున్నారు. ఎన్నో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇక తాజాగా భర్త అమ్మాయిలతో రాసలీలలు కొనసాగిస్తున్నాడని భార్యనే పోలీసులకు పట్టించింది. హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.

అమ్మాయిలతో రాసలీలలు కొనసాగిస్తున్నాడని తట్టుకోలేక ఓ భార్య పోలీసులకు ఫోన్‌ చేసి భర్తను, లాడ్జి నిర్వాహకులను పట్టించింది. నగర శివారులోని ఓ మున్పిపాలిటీకి వైస్‌ చైర్మన్‌గా ఉన్న ఓ వ్యక్తి వనస్థలిపురంలోని ఓ లాడ్జిలో అమ్మాయిలతో రాసలీలలు కొనసాగిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య పోలీసులకు ఫోన్‌ చేసింది. వనస్థలిపురంలో ఉన్న లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందించింది. ఇంకేముంది వెంటనే పోలీసులు లాడ్జి వద్దకు చేరుకుని దాడి చేశారు. ఆ సమయంలో ముగ్గురు అమ్మాయిలతోపాటు లాడ్జి యజమాని కూడా ఉన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి ఓనర్‌తో కలిసి మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Next Story