టీడీపీకి వంశీ గుడ్ బై..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Oct 2019 5:13 PM ISTవిజయవాడ: కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న గన్నవరం ఎమ్మెల్యే వంశీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. రాజీనామాకు కారణాలను లేఖలో వివరించారు. ఎన్నో కుట్రలు పన్నినా కూడా గన్నవరంలో ఎమ్మెల్యేగా అతి కష్టం మీద ఎమ్మెల్యేగా గెలిచానని లేఖలో పేర్కొన్నారు . గెలిచినా కూడా కొంత మంది తనప్తె కుట్రలు చేస్తున్మారని లేఖలో వివరించారు. తనను ఇబ్బంది పెట్టడంతోపాటు, అనుచరులప్తె కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగడం కష్టమని భావించి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. అనుచరులు ఇబ్బంది పడటం ఇష్టం లేకనే రాజకీయాల నుంచి వ్తెదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపా..ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని లేఖలో పేర్కొనడం అందరిలో ఆసక్తి రేపుతుంది.
శుక్రవారం బీజేపీ నేత సుజనా చౌదరిని, సీఎం జగన్ జగన్ ను కలవడం, రెండు రోజుల తరువాత రాజీనామా చేయడంప్తె రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. మరోవ్తెపు..బీజేపీ లేదా వ్తెఎస్ ఆర్ సీపీలో చేరతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.