తాడేపల్లిలో సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ
By Newsmeter.Network
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. అయితే ఈ మధ్యే టీడీపీకి రాజీనామా చేసిన వంశీ.. సీఎం జగన్‌తో కలిసి నడుస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వంశీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చంద్రబాబు, లోకేష్‌లపై ఆరోపణలు చేశారు. అయితే త్వరలో అంసెబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శీ సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉంటే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిచేందుకు వంశీ సీఎం జగన్‌తో సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా.. అసెంబ్లీలో తనను ప్రత్యేకంగా గుర్తించమని అడుగుతారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.