'ప్రేమికుల రోజు' వెనక అనేక కథలు..

By అంజి  Published on  12 Feb 2020 6:10 AM GMT
ప్రేమికుల రోజు వెనక అనేక కథలు..

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్‌ డే). ఈ రోజు ఎంతో మంది ప్రేమికులు తమ మనసులో మాటాలను ఒకరికొకరు చెప్పుకుంటూ గడుపుతారు. చాలా మంది యువత రోజు కోసం వెయ్యి కళ్లతో ఎదురూచూస్తున్న ప్రేమికుల రోజు సమీపిస్తోంది. అయితే ప్రేమికుల దినోత్సవం ఎలా వచ్చింది. దీని వెనక ఉన్న చరిత్ర ఎంటో తెలుసుకోండి.

పూర్వం రోమ్‌ రాజ్యంలో సెయింట్‌ వాలెంటైన్‌ అనే ఓ క్రైస్తవ ప్రవక్త ఉండేవారు. ఆ కాలంలో రోమ్‌ను చక్రవర్తి రెండో క్లాడియస్‌ పాలిస్తుండేవాడు. ఆయన తన పరిపాలనలో పెళ్లిళ్లను నిషేధించారు. కారణం.. మగవాళ్లు పెళ్లిచేసుకుంటే మంచి సైనికులు కాలేరనేది రాజు అభిప్రాయం. ఈ విధానం మన క్రైస్తవ ప్రవక్త వాలెంటైన్‌కు నచ్చలేదు. దీంతో అతను తన అనుచరులతో కలిసి ప్రేమికులకు రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవాడు. ప్రేమ, పెళ్లి దేవుడికి వ్యతిరేకం కాదని బోధిస్తూ.. రహస్య పెళ్లిళ్లు చేస్తున్న విషయం ఎంతో కాలం దాగలేదు. విషయం తెలుసుకున్న చక్రవర్తి రెండో క్లాడియస్‌.. వాలైంటన్‌ జైళ్లో పెట్టి, మరణశిక్ష విధించారు. తర్వాత కాలంలో చాలా అద్భుతాలు జరిగాయి. జైలులో ఉన్న సమయంలోనే వాలైంటెన్‌ జైలర్‌ కుమార్తె జూలియాతో ప్రేమ రాగాలు తీశాడు. ఫిబ్రవరి 14న మరణశిక్ష అమలుకు ముందు జైలర్‌ కుమార్తెకు వాలైంటెన్‌ ప్రేమ లేఖ పంపాడు. వాలెంటైన్‌ మరణం తర్వాత క్రీస్తుశకం 496లో పోప్‌ గెలాసియస్స్‌ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డే గా, ప్రేమికుల దినోత్సవంగా ప్రకటించాడు.

మరో పురాతన కథ ప్రకారం.. జైలర్‌ కూతురు అంధురాలు కావడంతో వాలెంటైన్‌ ఆమెకు చూపు తెప్పించాడని అంటుంటారు. శిక్షించబడుతున్న వ్యక్తి శిక్షిస్తున్న కూతురికి కంటిచూపు ప్రసాదించిన ఆ త్యాగ ప్రేమికుడిని అందరూ కొనియాడరని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడో శతాబ్దాల క్రితం.. జరిగిన ప్రేమికుల కథకు గుర్తుగా... ఇప్పటికి ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సం జరుపుకుంటున్నారు.

ప్రేమికుల రోజు వెనుక మరో కథ.. పూర్వ రోమ్‌ నగరంలో జూనో దేవతను ఎక్కువగా పూజించేవారు. ఆ దేవత స్త్రీలకు, పెళ్లిళ్లకు సంబంధించిన దేవత అని వారి నమ్మకం. అందుకే ప్రతి ఏటా ఫిబ్రవరి 14న రోమ్‌లో జూనో దేవతకు పెద్ద ఉత్సవం నిర్వహించేవారు. ప్రేమను వేడుకగా జరుపుకునే పండుగగా ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించేవారు. అయితే ఇప్పుడు జూనో దేవత ఉత్సవ వేడుక కాస్తా ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది.

1797లో మొదటిసారిగా బ్రిటన్‌లో వాలెంటైన్స్‌ డే గ్రీటింగ్‌ కార్డులను ముద్రించారు. ఆ తర్వాత శతాబ్దంలో వాలెంటైన్స్‌ డే కార్డుల అమ్మకాలు క్రమక్రమంగా పెరిగాయి.

ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు మాత్రమే జరుపుకునే వాలైంటెన్స్‌ డేను.. ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని జరుపుకుంటున్నాయి. ఎనీ వే అందరికీ ఫిబ్రవరి 14 వాలైంటెన్స్‌ డే శూభాకాంక్షలు.. మరీ

Next Story