ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వైష్ణవి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రిలోని ఓ గదిలో ఉరి వేసుకున్నాడు. గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా అజయ్‌ డైరీలో నలుగురు పేర్లు రాసి ఉంది. నలుగురు వ్యక్తులు తనను మానసికంగా వేధించడం వల్లే ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు.

వైష్ణవి ఆస్పత్రి భవన యజమాని కరుణారెడ్డి, అతని బావమరిది కొండల్ రెడ్డి, తుర్కయంజాల్ కాంగ్రెస్ నేత శివకుమార్, సరస్వతి నగర్ కాలనీ అధ్యక్షుడు మేఘారెడ్డి డబ్బు విషయంలో.. మానసిక వ్యథకు గురి చేసినట్లు, జీవితంపై నిరాశతో.. లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్లు డాక్టర్ అజయ్ లేఖలో పేర్కొన్నాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Newsmeter.Network

Next Story