వార ఫలాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2020 3:17 AM GMT
వార ఫలాలు

విజయ ముహూర్తం : 25-10-2020 ఆదివారం 01:42 నుండి 2.30 వరకు. ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి శుభప్రదం.

వాహనములకు ఉదయం గం. 11 లోగా పూజలు జరిపించు కోవలెను.

విశేష పర్వదినములు

25-10-2020 ఆదివారం విజయదశమి ఆయుధపూజ, (జమ్మి చెట్టు) శమీపూజ.

27-10-2020 మంగళవారం మతత్రయ ఏకాదశి.

28-10-2020 బుధవారం గోవత్స ద్వాదశి, పద్మనాభ ద్వాదశి.

31-10-2020 కౌముదీ ఉత్సవం వెన్నెలలో లలితా అర్చన , ఆటపాటలు.

మేష రాశి :- ఈ రాశి వారికి సౌఖ్యము ధనలాభము అనుకోని ఆనందాన్ని కలిగిస్తాయి. చంద్రుడు కుజునితో కలిసి ఉన్నప్పుడు అనగా రాబోయే శుక్ర శనివారాల్లో విపరీతమైన ధనం వ్యయం కనిపిస్తుంది. మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వారం లో కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒక సమయంలో మీకు అపకీర్తి కూడా ఉంది. నిదానంగా మీరు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులు పూర్తయినా కాకపోయినా వ్యతిరేక ఫలితాలు ఉండవు. అంటే జరగక పోవడం అనేది ఉండదు. తదుపరి వారం లోనైనా మీరు అది పొందే అవకాశం ఉంటుంది. మీ నోటి దురుసు తనం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా మీకు సకాలంలో మాత్రం ధనం చేతికి అందక పోవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి సాధ్యమైనంతవరకూ స్వతంత్ర ఆలోచనతో ముందుకు సాగండి. మీకు ఈ వారంలో 42 శాతం శుభఫలితాలుంటాయి. అశ్వినీ నక్షత్రం వారికి క్షేమ తార అయింది మధ్యమ ఫలితాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కృత్తిక 1వ భాగం వారికి సంపత్తార తో వారం ప్రారంభం శుభఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- సూర్య నమస్కారాలు, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, విజయదశమి నాడు అమ్మవారి పూజ శుభఫలితాలు ఇస్తాయి.

వృషభ రాశి :- ఈ రాశి వారికి శత్రువులు నశించడం వల్ల కొంచెం సౌఖ్యం పొందగలుగుతున్నారు. నష్ట ద్రవ్య లాభం కూడా ఉంది మీరు మళ్ళీ బంగారం అలంకారం రూపంలో కొంత సంపాదించుకునే అవకాశం ఉంది. బంధుమిత్రులు దర్శనం అయితే జరుగుతుంది. మీరు చేసే పనులు బయటకు కనిపించకా పోవడం వల్ల మీ యొక్క ఔన్నత్యం తక్కువగా ఉండొచ్చేమో ఎదుటి వాళ్ళకి ఆ విషయం తెలియక పోవడం వల్ల మిమ్మల్ని తక్కువగా అంచనావేసి అవమాన పరుస్తున్నారు. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించండి. సంకేతంగా చూపిస్తున్నాడు. మీ కుటుంబంలో వ్యవహరించి ఉన్నటువంటి వాళ్ళకి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త వహించండి. ఈ వారంలో అధిక ధనలాభం ఉంది. మొండి బకాయిలు పాత బకాయిలు కూడా కొంత వసూలవుతాయి. బుధ గురు శుక్ర అనుకూలత మీకు గొప్ప ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు ఈ వారంలో 50% శుభఫలితాలుంటాయి. కృత్తిక 2 3 4 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి చాలా బాగుంటుంది విశేష ఫలితాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది వయోభారంతో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని జాగ్రత్త వహించండి. మృగశిర 1 2 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది శుభ ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- శని జపం చేయించండి జమ్మిచెట్టుకు పూజ చేయండి. కలము ఆయుధము పుస్తకాలు వాటిని పెట్టి పూజ చేయండి. పౌర్ణమినాడు లలితా సహస్ర పారాయణం చేయండి.

మిధున రాశి :- ఈ రాశి వారు సుఖ సౌఖ్యాలను సంతోషం ఆనందాన్ని పొందగలుగుతారు. బుధుడు ప్రతికూలంగా ఉండడంచేత ఆలోచనా విధానంలో మార్పు వచ్చి పనులన్నీ వాయిదా పడతాయి. అష్టమ శని ప్రభావం చేత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి రోజులు వస్తాయి. వీరికి శుభ జీవితాన్ని పొందగలుగుతారు. వారం మధ్యలో ఆర్థిక వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాలు చేయడానికి పెద్ద అనుకూలంగా లేదు. తాను చేస్తే ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో మాత్రం కొనసాగడమే కాదు కొంతవరకు ఆర్థిక పరిపుష్టిని పేరుప్రఖ్యాతలు కూడా పొందగలుగుతారు. గురు ప్రభావం చేత మంచి పనులు కావలసి ఉన్నప్పటికీ సహవాస దోషాల వల్ల వీరిని చూడగానే చెడు భావం కలుగుతుంది కాబట్టి పరిచయాలను ఎక్కువగా పెంచుకోకుండా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం చాలా అవసరం. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి పెద్ద అనుకూల మైనటువంటి సమయం అయితే కాదు. కష్టపడినందుకు మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు కాబట్టి ఆ బాధ్యతలను కొనసాగడం మంచిది. ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి మీకు రాకుండా వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోండి. సప్తమం లో ఉన్న గురు దృష్టి మీకు చాలా మేలు చేకూరుతుంది కానీ మీరు వినియోగించుకోలేక పోతుంటారు. మానసికంగా మీరు దుర్బలత్వం చేరిపోతుంది. నీతి నిజాయితీలు మీరు దూరం చేసుకుంటున్నారు. ఈ వారంలో మీకు 50% శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది మృగశిర 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకున్న పనులు కొంతవరకు నెరవేరుతాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలు పొందుతారు. పునర్వసు 1 2 3 పాదాలు వారికి నైధనతార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- శనికి జపం చేయించండి. దశమినాడు జమ్మి చెట్టుకు పూజ చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి నమస్కరించండి. సప్తశతి పారాయణ ఖడ్గమాల సప్తశ్లోకి పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి విశేష ధనలాభము చక్కనైన జ్ఞానం చేత ఆలోచన చేత మంచి విషయాన్ని మంచి స్థాయికి ఎదుగుతారు. మీకు స్త్రీ వలన ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. బుధ ప్రభావం వల్ల శత్రుదేశం ఉంది కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేక సతమతమవుతారు. అనుకోకుండా మీ సంపాదన సంపాదన దుర్వినియోగం అవుతుంది. ఆలోచనలు స్థిరంగా లేకపోవడంవల్ల మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు అవుతానేమో అనిపిస్తుంది. కాబట్టి గురు అనుగ్రహం కోసం ప్రయత్నించండి. దైవానుగ్రహం కన్నా గురు అనుగ్రహం మీకు చాలా మంచి మేలు చేస్తుంది. బుధ గురు శుక్ర అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏ పనైనా తలపెడితే గట్టి నిర్ణయం తీసుకొని అందులో పరిపూర్ణమైన విశ్వాసంతో పని చేస్తే విజయం తప్పక వరిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం పొందే రోజులవి. మీకు ఈ వారంలో 42 శాతం శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. పునర్వసు 4వ పాదం వారికి నైధనతార అయ్యింది.ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి పనులన్నీ కూడా స్థిరంగా నెరవేరుతాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- విజయదశమి నాటి నుంచి లలితా సహస్రనామ పారాయణ చేయండి ఖడ్గమాల పారాయణ నిత్యము చేయండి. మంగళవారం నియమాలు మీకు ధైర్యాన్ని పెంచుతాయి.

సింహ రాశి :- ఈ రాశి వారికి సంపద ధనలాభం విశేష అలంకార ప్రాప్తి ఈ వారంలో వీరిని ఆనందంలో ముంచెత్తుతాయి, వీరికి మరలా పూర్వపు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ప్రభావం చేత వీరికి శత్రుపీడ ఉన్నప్పటికీ కూడా గురు శుక్రుల శని గ్రహ ప్రభావం చేత విశేషమే కాదు మంచి గౌరవ మర్యాదలు కూడా పొందగలుగుతారు ఏ పని చేపట్టినా అది ఒక ఆనందం కలిగి మంచి రోజులు వచ్చినట్లుగా మీరు సుఖపడతారు. శారీరక దారుఢ్యం విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్త వహించడం చాలా అవసరం. వారాంతంలో అధికారుల ఆగ్రహానికి లేదా వ్యాపార భాగస్వాములు మధ్య పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్థిరాస్తులను పొందగలుగుతారు. మీకు ఈ వారంలో 50శాతం శుభ ఫలితాలు ఉన్నాయి.మఖా నక్షత్రం వారికి క్షేమ తార అయింది మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఉత్తర 1వ పాదం వారికి సంపత్తార తో వారం ప్రారంభం శుభఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- నాన వేసిన ప్రజలు బుధవారంనాడు బెల్లం వేసి ఆవుకి తినిపించండి. విజయదశమి నాడు తప్పకుండా అమ్మవారి దర్శనము పూజ చేయండి. ఈ వారంలో ఖడ్గమాల మీకు మంచి ఫలితాలను కలుగజేస్తుంది.

కన్యా రాశి :- ఈ రాశి వారికి విశేష ధనలాభము స్వర్ణాకర్షణ ప్రాప్తి సుఖసౌఖ్యాలు ఆనందాన్ని అభివృద్దిని కలగజేస్తాయి. మీకు అంతర్గతంగా ఎల్లప్పుడూ భయం వెన్నంటి ఉంటూనే ఉంటుంది. మీ పనులలో కొన్నింటికి మీరే వాయిదా వేసుకుంటూ పోతారు. ఒకానొక సమయంలో ధననష్టం కూడా లేకపోలేదు. గురు ప్రభావం మీపై వ్యతిరేకంగా పని చేయటం మీకు అనుకోని ఖర్చులు కలిగే కొంత ధనాన్ని పోగొట్టుకుంటారు. శత్రువులు వృద్ధి చెందుతున్నారు. మీలో ఉన్న మన ధైర్యమే మన ముందుకు నడిపించాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే మీరు దాన్ని అనుకూలంగా మార్చుకోగల శక్తి మీద ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగండి. పెద్దలు విషయంలో సంతానం విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబపరంగా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కుజ ప్రభావం చేత ప్రతి కార్యము వాయిదా వేయటం వల్ల మీకు అనుకున్న అవకాశాలు చేజారిపోతున్నాయి. మీకు ఈ వారంలో 42 శాతం మాత్రమే శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉత్తర 2 3 4 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి చాలా బాగుంటుంది విశేష ఫలితాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు జన్మతార అయింది వయోభారంతో ఉన్నటువంటి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్త వహించండి. చిత్త 1 2 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది శుభ ఫలితాలు ఉన్నాయి.

పరిహారము :- మంగళవారం నియమం పాటించండి. ఖడ్గమాల పారాయణ సప్తశతి పారాయణ శ్రీ లలితా సహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తాయి.

తులా రాశి :- ఈ రాశి వారికి ధనలాభము ఉత్సాహము సంతోషము ఇవన్నీ వీరిని కొంతవరకు సుఖ సౌఖ్యాలతో నడిపిస్తాయి. వీరికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నా లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు ఉత్సాహం ఎక్కువగా కలిగించే కార్యాలు నిరాఘాటంగా ముందుకు నడిపించేలా చేస్తాడు. చాలా తెలివితేటలతో కార్యాన్ని మీరు నెరవేర్చుకునే అవకాశం తద్వారా విశేష ధన సంపాదనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత మంది ఏం చెప్పినా మీ తాలూకా ఉత్సాహం వలను మీరు ముందుకు సాగిపోయి పనులన్నింటినీ నెరవేర్చుకుని పెద్దల యొక్క మెప్పును పొందగలుగుతారు. బుధ గురువుల వ్యతిరేకత వల్ల మాత్రమే అప్పుడప్పుడు వీరు ఉన్న స్థానాన్ని మర్చిపోయి మాటల వల్ల చేతల వల్ల కొంచెం తక్కువ గా వ్యవహరించడం చేత అవమానాలపాలు అవుతారు. స్థానచలనం అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచి ప్రదేశాలు మంచి ఉన్నతిని పొందుతారు. ఈ వారంలో మీరు 34 శాతం మాత్రమే శుభ ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తోంది. చిత్త 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకున్న పనులు కొంతవరకు నెరవేరుతాయి. స్వాతి నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలు పొందుతారు. విశాఖ 1 2 3 పాదాలు వారికి నైధనతార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- అన్నిటికీ అమ్మవారిని నమ్ముకోండి. మీకు ఖడ్గమాల పారాయణ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. దేవి స్తోత్ర పారాయణలు విశేష ఫలితాన్ని కలుగజేస్తాయి. బుధవారం నాడు విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చిక రాశి :- ఈ రాశి వారికి ధన లాభం ఎక్కువగా ఉంది అనే చెప్పాలి. వీరికి గురు శుక్ర శని చంద్రులు మొత్తం ధనలాభం సూచిస్తున్నారు. విశేష సంపదను పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అనుకున్న పనులు చాలామటుకు మీరు నెరవేర్చుకుని ధైర్యంతో ముందుకు వెళ్తారు. చాలామంది యొక్క పనులను కూడా మీరు నెరవేర్చే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. తద్వారా ఇతరులు కూడా మీ వల్ల లాభం పొందగలుగుతారు. దానివల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు గౌరవమర్యాదలు కూడా లభిస్తున్నాయి. అయితే కుటుంబ విషయంలో అనవసరంగా ధనవ్యయం తప్పదు. మీకు కుజ గ్రహ వ్యతిరేకత వల్ల శత్రువుల భయం లేకపోలేదు. బుధుడు మీకు ఈ వారంలో పెద్దగా ప్రయోజనం చేకూర్చే లేకపోతున్నాడు పైగా హాని కలిగే అవకాశాన్ని సూచిస్తున్నాడు. దైవానికి భయపడి పనులన్నీ నెరవేర్చి నట్లయితే మీరు చాలా శుభప్రదమైన ఫలితాన్ని పొందగలుగుతున్నారు. పాత బాకీలు వసూలు అవకాశాలున్నాయి. అన్ని వ్యవహారాల్లో ఇంకొంచెం పెరుగుదల కనిపిస్తోంది. మిత్రులకు మీరు మీ సమయాన్ని కొంత వినియోగిస్తారు. మీకు ఈ వారంలో 42శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. విశాఖ 4వ పాదం వారికి నైధనతార అయ్యింది.ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి పనులన్నీ కూడా స్థిరంగా నెరవేరుతాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- మంగళవారం నియమాలు పాటించండి బుధవారం నాడు నానబెట్టిన పెసలు బెల్లం వేసి ఆవుకు తినిపించండి. సప్తశతి కథా శ్రవణం గాని ఖడ్గమాల లలితా సహస్రనామ పారాయణ అమ్మవారి స్తోత్ర పారాయణలు మంచి చేకూరుస్తాయి.

ధను రాశి :- ఈ రాశి వారికి ధన లాభం ఆనందము సంతోషము సుఖజీవితం ఇచ్చి మంచి మార్గంలో వీరిని నడిపిస్తుంది. శత్రువుల బాధ మాత్రం వీరికి తప్పదు. అలాగే స్థానచలనం కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. శని ప్రభావం చేత మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ మీకు శుక్రుడు ప్రభావము అది ఒక మంచికే మార్చేస్తుంది. ఎవరికీ లేని అనుకూలత రాహు మీకు సుఖ జీవితాన్ని పంచు తున్నాడు. అటువంటి అవకాశం మీకు వస్తుంది కనుక అది వినియోగించుకున్నట్లు అయితే మీరు చాలా విషయాల్లో ఆనందాన్ని పరిపూర్ణంగా పొందడమే కాక ఇతరులను కూడా మాటల ద్వారా చేతల ద్వారా మెప్పించగలరు. తద్వారా మీకు ధన సంపాదన ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంతో ఎక్కువ హాయిని ఆనందాన్ని పొందగలుగుతారు. నూతన వ్యాపారాదులు కి పెద్ద అనుకూలంగా లేదు గాని పాత వ్యాపారాన్ని అధికంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది పాతబాకీలు వసూలవుతాయి. మూల నక్షత్రం వారికి క్షేమ తార అయింది మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి సంపత్తార తో వారం ప్రారంభం శుభఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- గురువారం నియమం పాటించండి గురు చరిత్ర స్తోత్ర పారాయణ, అమ్మవారి స్తోత్రాలు పారాయణ విశేష లాభాన్ని కలిగిస్తాయి. ఖడ్గమాల చాలా ఉన్నతమైన ఫలితం ఇస్తుంది.

మకర రాశి :- ఈ రాశి వారికి కార్యజయం తో వారం ప్రారంభమవుతోంది. ఈ రాశి వారికి ఎవరికీ లేని విశేష ఫలితాలుఈ వారంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సకల సౌఖ్యాలు ఈ వారంలో వీరు అనుభవించి ఇతరులను సంతోష పరచే అవకాశాలు ఉన్నాయి. గురు దృష్టి లేకపోవడం వల్ల ఒకప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినా స్థిరాస్తి వ్యవహారాలు కూడా చక్కబడతాయి. ధన అభివృద్ధి ఎక్కువగా ఉంది. శని ద్వారా ఒక ఆటంకం వచ్చినప్పటికీ కూడా పెద్దల సాంగత్యము రాజకీయ పలుకుబడి ఇవన్నీ మీకు లభించి ప్రతి పనిలో నుంచి కూడా మీరు విశేష లాభాన్ని పొందగలుగుతున్నారు. చిన్నపిల్లలు వయోవృద్ధులైన వారి ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. స్వార్థం లేకుండా పనిచేయడం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. చాలాకాలం నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా పరిష్కారం అయిపోతాయి. దైవానుగ్రహము గురు అనుగ్రహం కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి దైవ స్మరణ మానేయకండి. శని ఒక విపత్తు కారణం అవుతాడు అయినా సరే శుక్ర బుధులు మిమ్మల్ని అందులో నుంచి బయట పడేస్తారు. మీకు ఈ వారంలో 58శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాడ 2 3 4 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి చాలా బాగుంటుంది విశేష ఫలితాలు ఉన్నాయి. శ్రవణా నక్షత్ర జాతకులకు జన్మతార అయింది వయోభారంతో ఉన్నటువంటి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్త వహించండి. ధనిష్ట 1 2 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది శుభ ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- అమ్మవారి పూజలు స్తోత్ర పారాయణలు మేలుచేస్తాయి. సప్తశతి పారాయణ చేయించండి. వీలైతే మంగళవారంనాడు చండీ హోమం చేయించండి.

కుంభరాశి :- ఈ రాశివారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కించిత్తు ధన లాభం కూడా ఉంది. కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం ఉంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా మీకంటే ముందే మీ వ్యతిరేక భావాలు మీ వ్యతిరేక వర్గం అక్కడికి చేరి ప్రతి పని ఆటంక పరుస్తూ అయి ప్రతి దాంట్లో నీకు అనుమానం ఎక్కువ గా మరియు శ్రమ మిగులుతుంది ఎంత కష్టపడినా ఫలితం తక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు ఎక్కువ నష్టం చూడబోతున్నారు. గౌరవాన్ని కూడా భంగం వాటిల్లుతోంది. పని చెయ్యక తప్పదు ఫలితం మాత్రం మీరు పొందలేరు. ఆ ఫలితాలు ఇతరుల పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ శ్రమను గుర్తించేవారు కూడా తక్కువగా ఉంటారు. ఆర్థికంగా కూడా లేని పరిస్థితి మీరు పొందాల్సిన అవసరం ఏర్పడుతుంది. జేబులో డబ్బు ఉండి కూడా మీరు అనుభవించలేని స్థితి. వ్యయ శని ప్రభావం కూడా మీ పై ఎక్కువగా పనిచేస్తుంది. అతి కష్టం మీద మీరు ఈ వారాన్ని దాటాల్సి ఉంటుంది. మీకు ఈ వారంలో 34 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకున్న పనులు కొంతవరకు నెరవేరుతాయి. శతభిషం నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలు పొందుతారు. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి నైధనతార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- అమ్మవారిని నమ్ముకోండి సప్తశతి పారాయణ ఖడ్గమాల పారాయణ లలితా సహస్రనామ పారాయణ దీనిని విడిచిపెట్టకండి మంగళవారంనాడు వీలైతే చండీ హోమం చేయించండి విశేష ఫలితాన్ని పొందగలుగుతారు.

మీన రాశి : ఈ రాశి వారికి కుటుంబంతో కలిసి యోగము ఇష్ట పూర్తి, లాభం ఉన్నాయి. వీటి ద్వారా వీరు ఎక్కువ ఆనందాన్ని అనుభూతిని పొందుతూ చక్కని ప్రశాంతతను చవి చూస్తారు. వీరికి ఆదాయం కన్నా అనుభూతి ఎక్కువగా మిగులుతుంది. కుజ గురు శుక్రులు వీరికి వ్యతిరేక స్థితిలో ఉండటం వల్ల పనులలో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా పెద్దల యొక్క సహకారము వీరికి లభించి మీరు ప్రతికూలతలు నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్ద విషయమే చోటుచేసుకునే పరిస్థితి కుజ గ్రహ స్థితిని సూచిస్తుంది అలాగే రవి కూడా అనారోగ్యం సూచిస్తున్నాడు ఒక దగ్గర చేర్చి గురువు అనుగ్రహం లేకపోవడాన్ని శుక్ర స్థితిని చూసినట్లయితే మీ కుటుంబం లో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యమే కాదు గౌరవమర్యాదలు కూడా భంగం వాటిల్లి ఇతరుల చేత అవమానింప పడతారు. గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మీకు ఈ అవమానం తట్టుకోలేని స్థితికి తీసుకెళ్తుంది దానివల్ల మీరు కుటుంబానికి సమాజానికి దూరమై పోవాలనే భావాలు కలుగుతాయి. అందుచేతనే మీరు ఎక్కువగా కుటుంబం మధ్యలో నివసించడానికి ప్రయత్నించండి దైవానుగ్రహం తో మీరు ముందుకు నడవాలి.మీకు ఈ వారంలో 42శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి నైధనతార అయ్యింది.ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి పనులన్నీ కూడా స్థిరంగా నెరవేరుతాయి. రేవతి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం: మంగళవారంనాడు సబ్సిడీ పారాయణ గాని దేవి స్తోత్ర పారాయణం చేయండి గురు శుక్ర వారాల్లో బ్రాహ్మణులకు భోజనము లేదా అన్నదానం లేదా స్వయంపాకం దానం చేయండి. ఎక్కడ హోమం జరిగినా మీరు పాల్గొని ఆ ఫలితాన్ని పొందండి.

Next Story