లక్నో : నాలుగు రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకు భారీ నష్టమే జ‌రిగింది. వరద బీభ‌త్సానికి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 73 మంది మరణించారు. ఇంకా కొన్ని జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రయాగరాజ్‌, వారణాసి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవడంతో జనజీవనం స్తంభించింది. కుండపోత వ‌ర్షాల‌కు లక్నో, అమేథి, హర్దోయ్‌ సహా పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని డివిజనల్‌ కమిషనర్లు, జిల్లా మేజిస్ర్టేట్‌లను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశించారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబానికి రూ. 4 లక్షల‌ పరిహారం అందించాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story