ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌వి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 12:36 PM GMT
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌వి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు

ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్మికుల న్యాయమైన హక్కులను కాలరాసే విధంగా ముఖ్యమంత్రి పాశవికంగా పాలిస్తున్నార‌న్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. సమ్మె చేసిన వారిని బెదిరిస్తున్నారని అన్నారు.

ఉద్యోగులు, ప్రజలు అంద‌రూ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇది ప్రజలపై సీఎం కేసీఆర్ చూపిస్తున్న అక్కసుకు నిదర్శనమ‌ని వారు అన్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా.. విధుల్లో చేరని వారిని ఉద్యోగాలు పీకేస్తామని బెదిరించడం నియంత చర్య అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రజలు బస్సులు లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడుతారని. ప్రజల కష్టాలకు, నష్టాలకు ముఖ్యమంత్రినే కారణమ‌ని వారు అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తుందని.. కార్మికులతో ప్రజాస్వామ్య బద్దంగా చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story