హానికరమైన వైరస్ నుంచి కాపాడే కరివేపాకు..ఇంకా ఎన్నో ఉపయోగాలు

By రాణి  Published on  11 April 2020 10:59 AM IST
హానికరమైన వైరస్ నుంచి కాపాడే కరివేపాకు..ఇంకా ఎన్నో ఉపయోగాలు

కరివేపాకు..సాధారణంగా కూరల్లో, తాలింపుల్లో వాడుతారు. అన్నం తినేటపుడు చాలా ఈజీగా కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తాం. కానీ కరివేపాకు వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఇకపై తీసి పక్కనపెట్టరు. కరివేపాకులో అన్ని ఔషధగుణాలుంటాయి మరి.

రోజూ పెరుగుతోన్న ట్రాఫిక్ తో పాటు, మన శరీరంలో హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వల్ల జుట్టు రాలిపోతుంటుంది. చాలా మందికి బట్టతల కూడా వస్తోంది. జుట్టును రాలడం, ఒత్తుగా చేయడంలో కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉన్నదివ్య ఔషధ గుణాలు 80 శాతం రాలిన జుట్టు మళ్లీ పొందవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

  • రోజూ ఉదయం పూట ఒకగ్లాసు కరివేపాకు రసం తాగడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందట. ఇలా 60 రోజుల పాటు తాగాలి. మరి కరివేపాకు రసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ? రెండుగ్లాసుల నీరు గిన్నెలో పోసి మరిగించుకోవాలి. కాసేపు మరిగాక ఆ నీటిలో రెండు గుప్పిళ్లు కరివేపాకు వేసి మరో 5-10 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి కొద్దిగా ఉప్పు కలుపుకుని పరగడుపున తాగాలి. ఇలా 60 రోజుల పాటు తాగితే జుట్టు రాలడం తగ్గడంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది.

  • కరివేపాకులో ఉండే ఎ విటమిన్ కంటిచూపును మెరుగు పరుస్తుంది. ఫలితంగా సైట్ రాకుండా కాపాడుతుంది.

  • వంశానుసారంగా డయాబెటీస్ వస్తుందన్న భయం చాలామందిని వెంటాడుతుంటుంది. అలా పూర్వీకుల నుంచి వస్తున్న డయాబెటీస్ మీకు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం 10 కరివేపాకు ఆకులను కడిగి తినాలి. మొదట ఇబ్బందిగా అనిపించినా నెమ్మదిగా అలవాటవుతుంది. ఇలా తినడం వల్ల డయాబెటీస్ ను రాకుండా అరికట్టొచ్చు.

  • అదేవిధంగా కరివేపాకును పొడి చేసుకుని అన్నంలో, టిఫిన్ లో కలిపి తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

  • కరివేపాకుతో రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. కరివేపాకును ఆహారంతో కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు మొటిమలు, ముఖంపై మచ్చలు ఏర్పడటం తగ్గుతుంది.

  • తేన్పులు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను కూడా కరివేపాకు నివారిస్తుంది.

  • జపాన్ లో మెజియో యూనివర్శిటీలో చేసిన పరిశోధనల్లో కరివేపాకు లుకేమియా అనే క్యాన్సర్ ను కాపాడుతుందని, హానికరమైన వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాలేయాన్ని కాపాడుతుందని తేలింది.

  • ఇన్ని ఉపయోగాలున్న కరివేపాకును ఔషధంగా భావించి తినండి. రోగం వచ్చాక ఆస్పత్రులకెళ్లి వైద్యులిచ్చే మందుబిళ్లలు మింగే కన్నా..రోగం రాకుండా కాపాడే కరివేపాకును ఆహారంలోంచి తీసి పక్కనపెట్టకుండా తినడం మేలు కదా..

Also Read : ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా కనకరాజు

Next Story