'యూఎస్‌బీ కండోమ్' | అసురక్షిత సంబంధాల నుంచి మీ మొబైల్ ను కాపాడే 'కండోమ్'

By Medi Samrat  Published on  17 Nov 2019 7:51 AM GMT
యూఎస్‌బీ కండోమ్ | అసురక్షిత సంబంధాల నుంచి మీ మొబైల్ ను కాపాడే కండోమ్

మీ మొబైల్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా 'యూఎస్‌బీ కండోమ్'

ఎక్కడో ప్రయాణంలో ఉండగా మీ మొబైల్ చార్జింగ్ అయిపోయిందనుకొండి. మీ దగ్గర చార్జర్ లేదనుకొండి. కానీ రైల్వే స్టేషన్లో ఒక మొబైల్ చార్జింగ్ యూఎస్ బీ పోర్టు కనిపిస్తే మీకు ఎడారిలో ఒయాసిస్ కనిపించినంత ఆనందం కలుగుతుంది. కానీ సదరు యూ ఎస్ బీ పోర్టు ఎంత సురక్షితం? దాని నుంచి మీ మొబైల్ కి విద్యుత్ సరఫరా జరుగుతుంది. కానీ అదే సమయంలో మీ యూ ఎస్ బీ పోర్టు నుంచి డేటా తరలిపోయే ప్రమాదమూ ఉంది. యూ ఎస్ బీ పో్ర్ట్ నిజానికి డేటా బదలాయింపుకీ, చార్జింగ్ కీ ఉపయోగపడుతుంది. అదే దాని బలం. బలహీనత కూడా!! ఒకే కనెక్షన్ లో రెండు పనులు అయిపోతాయి.

కానీ డేటా లీక్ సమస్య కూడా అంతే ఉంది. దీనినే జ్యూస్ జాకింగ్ అంటారు. ఇదొక పెద్ద ప్రమాదం. ఇందులో సదుపాయం ఉంది. కానీ అసురక్షిత సంబంధంలో సమస్య కూడా ఉంది. అసురక్షిత సంబంధాల వల్ల ప్రమాదం రాకుండా ఉండాలంటే కండోమ్ అవసరమైనట్టే యూఎస్ బీ పోర్టుకు కూడా పది డాలర్ల కండోమ్ అవసరం. వినడానికి తమాషాగా ఉంది కదూ. కానీ ఎక్స్ పిటర్ అనే సంస్థ పది డాలర్ల యూఎస్‌బీ కండోమ్ ను రూపొందించింది.

దీనిని యూఎస్ బీ పోర్టుకు మీ డివైస్ కి మధ్య అమర్చితే చార్జింగ్ సురక్షితం అవుతుంది. దీని వల్ల మీ సురక్షితంగా చార్జిచేసుకోవచ్చు. అదే సమయంలో మీ డేటా లీక్ కావడమో లేక వైరస్ దాడికి కారణమయ్యే మాల్ వేర్ మీ సిస్టమ లోకి ప్రవేశించడమో జరగదు. దీని వల్ల మీ డివైస్ సురక్షితంగా ఉంటుంది. ఈ “కండోమ్” మీ యూ ఎస్ బీ పోర్టు లోని డేటా పిన్స్ ని డిజేబుల్ చేస్తుంది. అంటే అవి పనిచేయకుండా నిరోధిస్తుంది. ఫలితంగా మీ పోర్ట్ కేవలం చార్జింగ్ మాత్రమే చేయగలుగుతుంది. డేటాలీక్ కి వీలుండదు.

అసుర‌క్షిత ప్రాంతాల్లో మొబైల్ చార్జింగ్ పెట్ట‌డం కూడా ప్ర‌మాద‌మే..

ఇది టైప్ ఏ, మైక్రో బి, మిని బి అనే మూడు మాడల్స్ లో లభ్యమౌతోంది. దీనినివాడితే డేటా చౌర్యం ఇక సాద్యం కాదు. మీ మొబైల్ సురక్షితం అవుతుంది. కాబట్టి పట్టుమని పది డాలర్లు అంటే వెయ్యి రూపాయల లోపే దొరికే ఈ కండోమ్ ను ఉపయోగించుకుంటే మీ మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ డివైజ్ కు అసురక్షిత పోర్టులతో సమస్యే ఉండబోదు. కాబట్టి నిత్యం ప్రయాణాల్లో ఉండే రహదారివీరులకు యూఎస్‌బీ కండోమ్ చాలా అవసరం. కాదంటారా?

ఇదిలావుంటే.. గత దశాబ్దం కాలంగా స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్స్ వాడకం పెరగ‌డం కార‌ణంగా ఛార్జింగ్ స్టేషన్లు ప్రాచుర్యం పొందాయి. అయితే.. యుఎస్‌బి ఛార్జర్ స్కామ్‌లో నేరస్థులు.. మాల్‌వేర్‌ను ఛార్జింగ్ స్టేషన్లు లేదా స్టేషన్లలో ప్లగ్ ఇన్ చేసి ఉంచే కేబుళ్లలోకి లోడ్ చేస్తారు. దీని ద్వారా వారు సందేహించని విధంగా వినియోగదారుల ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు సోకేలా చేస్తార‌ని అని LADA తెలిపింది.

Next Story