జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ గత నెలలో తండ్రి అయిన విషయం తెలిసిందే. అతడి భాగస్వామి కాసీ బెన్నెట్‌ జూన్‌ 14న పండంటి ఆడబిడ్డకు జన్మచ్చింది. అయితే.. ఈ దిగ్గజ స్ర్పింటర్‌ ఇప్పటి వరకు తన కూతురు పేరును కానీ.. ఫోటోను కానీ ఎక్కడా చెప్పాలేదు. తాజాగా తన కూతురి ఫోటోలను బోల్ట్‌ రిలీజ్‌ చేశాడు. అంతే కాదు తన కూతురికి ఓ అద్భుతమైన పేరును కూడా పెట్టాడు. తన ప్రియురాలు కాసీ బెన్నెట్‌ పుట్టిన రోజు సందర్భంగా కూతురు పేరును ప్రకటించాడు బోల్ట్‌. ఒలంపియా లైటనింగ్‌ బోల్ట్‌ అని తన కుమారైకు పేరు పెట్టాడు.

‘నా ప్రేయసి కాసీకి పుట్టిన రోజు శుభకాంక్షలు. ఈ ప్రత్యేక రోజున నీతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్న. నేను మీ ఆనందాన్ని తప్పా మరేది కోరుకోను. నిన్ను ఎప్పుడు సంతోషంగా, చిరునవ్వుతో ఉంచడం నా బాధ్యత. మేము మా కూతురు ‘ఒలింపియా లైట్నింగ్’‌తో కొత్త జీవితాన్ని ప్రారంభిచాం’ అంటూ బోల్ట్‌ ట్వీట్‌ చేశాడు. బోల్ట్ త‌న కూతురి ఫోటోల‌ను షేర్ చేయ‌గానే.. టెన్నిస్ స్టార్ సెరీనా విలియ‌మ్స్ హార్ట్ ఎమోజీల‌తో రిప్లై ఇచ్చింది. ఎందుకంటే సెరీనా కూతురు పేరులో కూడా ఒలంపియా అని ఉంటుంది. సెరీనా కూతురి పూర్తి పేరు ‘అలెక్సిస్ ఒలంపియా’.

100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్‌.. 2008, 2012, 2016 ఒలింపిక్స్‌ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా.. బోల్ట్‌ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరు బద్దలు కొట్టలేదు. తన అథ్లెటిక్ కెరీర్‌లో 8 ఒలింపిక్ బంగారు పతకాలతో పాటు 11 వరల్డ్ ఛాంపియన్‌షిప్ పతకాలను సాధించాడు. దశాబ్దంపాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన బోల్ట్‌ 2017లో రిటైర్‌ అయ్యాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet