అగ్రరాజ్యంలో అల్లకల్లోలం
By రాణి Published on 24 April 2020 2:46 PM ISTముఖ్యాంశాలు
- 50 వేలు దాటిన మరణాలు
- 9 లక్షలకు చేరువలో కరోనా కేసులు
కరోనా వైరస్ మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ ఛాయలు అమెరికాలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. బుధవారం కరోనా మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయని ఉపశమనం పొందేలోపు గురువారం మృతుల సంఖ్య మరింత పెరిగింది. రెండ్రోజుల వ్యవధిలో అమెరికా 3,176 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 71వేలు దాటగా..ఒక్కఅమెరికాలోనే 8 లక్షల 90 వేల కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల విషయానికొస్తే ప్రపంచ వ్యాప్తంగా లక్షా 91 వేల మంది వైరస్ సోకి మృతి చెందగా ఒక్క అమెరికాలోనే 50 వేల 372 మంది మృతి చెందారు. యావరేజ్ గా చూస్తే ప్రపంచ మరణాల్లో 4 వ వంతు , కేసుల్లో 3 వ వంతు అమెరికాలోనే నమోదయ్యాయి.
Also Read : కరోనాకు డాక్టర్- ఐపీఎస్ విరుగుడు
ఆర్థికంగా ఎదిగిన దేశాల్లో ముందు వరుసలో ఉన్న అమెరికా..వైరస్ కారణంగా పతనమవుతున్న దేశాల్లోనూ ముందే ఉంది. ఈ విషయం ఆ దేశ అధికారులు, పౌరుల్ని కలవరపెడుతోంది. కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడితే నెమ్మదిగా మూతపడిన వ్యాపారాలను ప్రారంభించి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడాలన్న యోచనలో ఉందీ అగ్రరాజ్యం. తమ దేశంలో పౌరులకే ఉద్యోగాలు లేకపోవడంతో పెద్దన్న ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ను తాత్కాలికంగా ఆపివేశారు. అమెరికా ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం నుంచి కోలుకునేంత వరకూ కొత్త వీసాలను ఇవ్వబోమని స్పష్టం చేశారు ట్రంప్. ఈ నిర్ణయం ఎక్కువగా భారత్, చైనాలపై ప్రభావం చూపనుంది. అమెరికా ఉద్యోగ వేట కోసం ఎక్కువగా వెళ్లేది ఇండియా, చైనా పౌరులే.
Also Read : కుర్రకారుకు కిక్కెక్కిస్తోన్న తేజస్వి అందాలు