చ‌రిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2020 3:28 AM GMT
చ‌రిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌

భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక‌య్యింది. అగ్ర‌రాజ్య చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక మహిళ, ఒక ఆసియన్‌ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి. ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక‌య్యి కమలా హ్యారిస్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఆమె ఇంతకుముందు కూడా ఎన్నో ఘనతలు సాధించారు.

1964 అక్టోబర్‌ 20న ఒక్లాండ్‌లో జన్మించిన కమలా హ్యారిస్ తల్లి తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు. వాషింగ్టన్‌ డీసీలోని హోవార్డ్‌ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు. యూసీ హేస్టింగ్స్‌ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నా రులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు.

ఆ త‌ర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అనంత‌రం‌ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. అప్పుడే ఈమె మాజీ అధ్య‌క్షుడు బరాక్‌ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్‌ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు.

Next Story