అహ్మదాబాద్‌: మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం జరుగుతోంది. సందర్శకులతో మోతెరా స్టేడియం కిక్కిరిసిపోయింది. కాగా భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మోతెరా స్టేడియంలో భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మొదటగా ‘నమస్తే’ అంటూ ట్రంప్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని ట్రంప్‌ అన్నారు. ఇండియాకు రావడం గౌరవంగా భావిస్తున్నానని.. నా నిజమైన మిత్రుడు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్న అని అన్నారు.

మోతెరా స్టేడియం చాలా అద్బుతంగా ఉందన్నారు. ఈ అతిపెద్ద స్టేడియాన్ని ప్రారంభించడం సంతోషకరమని ట్రంప్ పేర్కొన్నారు. తమ హృదయంలో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానముంటుందన్నారు. చాయ్‌ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన మోదీ స్పూర్తి ప్రదాత అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌ పురోగమిస్తోందిన డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని.. భారత్‌ పురోగమిస్తున్న విధానం అద్భుతమన్నారు. భారత్‌ను అమెరికన్లు ప్రేమిస్తారని ట్రంప్‌ వ్యాఖ్యనించారు.

ట్రంప్‌ తన ప్రసంగంలో అధ్యాత్మిక వేత్త స్వామి వివేకానందను ప్రస్తావించారు. ఏడాదికి భారత్‌ 2 వేల సినిమాలు నిర్మిస్తోందన్నారు. డీడీఎల్‌ సినిమాకు సినిమాపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్‌ పెద్ద పీట వేసిందని.. భారతీయ సినిమాలను ప్రపంచం ఇష్టపడుతోందన్నారు. విభిన్న భాషల సమ్మేళనం ఇండియా అని అన్నారు. ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి అమెరికాకు ఉందన్నారు. భారత్‌ భిన్నత్వంలోని ఏకత్వం ప్రపంచానికి ప్రేరణ అని ట్రంప్‌ వ్యాఖ్యనించారు. ద్వైపాక్షిక బంధం, బలోపేతానికి మోదీ, తాను కృషి చేస్తున్నామని అన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం కొనసాగుతోందన్నారు. రేపు సైనిక హెలికాప్టర్ల ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం కొనసాగుతందని, ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను అడ్డుకోవడానికి భారత్‌, అమెరికా పోరాడుతున్నాయని ట్రంప్‌ అన్నారు.

అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్‌-అమెరికా మైత్రి బంధం వర్ధిల్లాలన్నారు. మోతెరా స్టేడియం నవ చరిత్రకు వేదిక అని మోదీ అన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.