ట్రంప్‌ తల తీసుకొచ్చిన వారికి ఇరాన్‌ బంపర్‌ ఆఫర్‌..!

By అంజి  Published on  6 Jan 2020 11:57 AM GMT
ట్రంప్‌ తల తీసుకొచ్చిన వారికి ఇరాన్‌ బంపర్‌ ఆఫర్‌..!

ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడి తలపై భారీ రివార్డు ప్రకటించింది. ట్రంప్‌ తల తీసుకువస్తే 80 మిలియన్‌ డాలర్ల రివార్డు ఇస్తానని పేర్కొంది. అమెరికా దాడిలో ఇరాన్‌ సైనిక జనరల్‌ సులేమాన్‌ మృతి చెందాడు. దీంతో ఆ దేశం ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటోంది. ఎలాగైన గట్టి ఎదురుదెబ్బ కొట్టాలని చూస్తోంది. ఇప్పటికే ఇరాన్‌, అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సులేమానీ అంత్యక్రియల్లో వేలాది మంది జనం పాల్గొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాసీం సులేమానీ అంత్యక్రియలను టీవీల్లో చూపించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడి తల తీసుకువచ్చిన వారికి భారీ రివార్డు ఇస్తామని అక్కడి గవర్నమెంట్‌ టీవీ ఛానెల్‌ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. భారతదేశ కరెన్సీలో సుమారు రూ.575 కోట్లు ఇస్తామని చెప్పింది.

శుక్రవారం బాగ్దాద్ విమానాశ్రయంలో చేసిన రాకెడ్ దాడుల్లో ఇరాక్ ఆర్మీ కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీ హతమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. సైనికులు, అమెరికా దౌత్యాధికారులే లక్ష్యంగా సులేమానీ దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించామనీ, అందుకే ఆయన్ని హతమార్చాల్సి వచ్చిందని ప్రకటించారు. ఇటీవల బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ముట్టడి సహా ఇరాక్‌లోని అమెరికా మిత్రపక్షాల సైనిక స్థావరాలపై దాడులకు అతడే సూత్రధారి అని పేర్కొన్నారు. అమెరికా సంకీర్ణ దళాలకు చెందిన వందల మంది సైనికుల మరణాలకు, వేల మంది గాయపడటానికి అతడిదే బాధ్యత అని ఆరోపించారు. న్యూదిల్లీ, లండన్‌లో ఉగ్రదాడులకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

దాడి తర్వాత వెంటనే అమెరికా జెండాను ట్వీట్‌ చేసిన ట్రంప్, మరో ట్వీట్‌లో ఇరాన్‌ ఎన్నడూ యుద్ధాల్లో గెలవలేదని ట్వీట్ చేశారు. మరోవైపు అమెరికాపై ప్రతీకార దాడులు తప్పవని ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖొమైనీ హెచ్చరించారు. సోలీమని దేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన త్యాగధనుడని పార్సీ భాషలో ఆయన ట్వీట్ చేశారు.

Next Story