భారత్ కు భారీ సహాయం ప్రకటించిన అగ్రరాజ్యం
By రాణి Published on 6 April 2020 6:49 PM IST
భారత్ లో రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అటు అమెరికాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయినప్పటికీ భారత్ కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికా భారీ సహాయాన్ని ప్రకటించింది. భారత్ కరోనా పై పోరాడేందుకు అమెరికా 2.9 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (యూఎస్ఏఐడీ)ద్వారా భారత్ కు ఈ సహాయమందిస్తున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. ఈ మేరకు భారత అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ ప్రకటన చేశారు. భారత్ లో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు తాము చేస్తున్న సహాయం ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని తిప్పికొట్టేందుకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ), యూఎస్‌ఏఐడీ వంటి సంస్థలు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రపంచం మొత్తంమీద అమెరికాలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం..భయం గుప్పిట్లో ప్రజలు
అమెరికాలో 3,37,309 కరోనా కేసులు నమోదవ్వగా 17,528 మంది కోలుకున్నారు. మరో 9,643 మంది మృతి చెందారు. ఇటలీ, స్పెయిన్ తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదైంది అమెరికాలోనే. ప్రపంచ వ్యాప్తంగా 12,88,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 2,70,249 మంది కోలుకున్నారు. 70,482 మంది మృతి చెందారు. కాగా..గడిచిన 24 గంటల్లో ఇటలీ, స్పెయిన్, జర్మనీ, కెనడా దేశాల్లో ఒక్క కరోనా కేసు గానీ, కరోనా మృతి గానీ నమోదవ్వలేదు. దీంతో ఒక్కసారిగా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టిందన్న సంకేతాలొస్తున్నాయి.
Also Read :లాక్ డౌన్ ఎత్తివేతతో ఉద్యోగాలు ఊడనున్నాయా ?