చూసే వారికి అది చాలా తేలికే..కానీ చేసే వారికే చాలాకష్టమంటున్న ఉపాసన

By రాణి  Published on  17 April 2020 9:07 PM IST
చూసే వారికి అది చాలా తేలికే..కానీ చేసే వారికే చాలాకష్టమంటున్న ఉపాసన

మెగావారింటి కోడలు, అపోలో వైస్ ప్రెసిడెంట్, బీ పాజిటివ్ మ్యాగ్జైన్ చీఫ్ ఎడిటర్ అయిన ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. అప్పుడప్పుడూ నెటిజన్లకు హెల్త్ టిప్స్ కూడా చెప్తుంటారు. కరోనా వైరస్ భారత్ లో వ్యాప్తి చెందటం మొదలైనపుడు ఇంట్లోనే హ్యాండ్ మాస్క్ లు ఎలా తయారు చేసుకోవాలో చెప్పారు. తాజాగా..మరో ఆసక్తికరమైన విషయం గురించి తన అభిప్రాయాన్ని ఇన్ స్టాలో షేర్ చేశారు.

Also Read : తెలుగు సినీ కార్మికుల కోసం బిగ్ బి భారీ విరాళం

మోకాళ్ల మీద రెండు చేతులు సపోర్ట్ చేసి కూర్చుని ఉన్న ఫొటోని జోడించి..ఇలా కూర్చోవడం చూసే వారికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ..అలా కూర్చోవడం చాలా కష్టం. హైదరాబాద్ లో చాలా మంది ఇలాగే కూర్చుంటారని అన్నారు. ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో మీరు కనీసం 5 నిమిషాలైనా కూర్చోగలరా ? అని నెటిజన్లను ప్రశ్నించారు. నిజానికి ఇలా కూర్చోవటం వల్ల ఆరోగ్యకరైన ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపారు. ఇది కూడా ఒకరమైన వ్యాయామమేనని, మే 3 తర్వాత ప్రతిరోజూ తాను కూడా ఇలాంటి వ్యామాయం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు.

Also Read :అక్కడ కరోనా మరణాల కన్నా..లాక్ డౌన్ కాల్పుల మరణాలే అధికం

Next Story