28మందిని బలి తీసుకున్న చ‌లి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Dec 2019 4:40 AM GMT
28మందిని బలి తీసుకున్న చ‌లి

ఉత్తరాది రాష్ట్రాలను చ‌లి వ‌ణికిస్తుంది. చ‌లితీవ్ర‌త‌కు జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఒక్క‌ ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రంలోనే చలి తీవ్రతకు 28 మంది మృత్యువాత పడ్డారు. కాగా, శ‌ని, ఆది వారాల్లో కూడా చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

యూపీ ప్రభుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా మృతుల సంఖ్యను ప్రకటించనప్పటికీ వివిధ జిల్లాలలో ఉన్న‌ లెక్క‌ల ప్ర‌కారం కాన్పూర్‌లో 10 మంది, వారణాసిలో నలుగురు, మహోబాలో నలుగురు, శ్రావస్తి, బాందా, మెయిన్‌పురిల్లో ఇద్దరు, లక్నోలో ఒకరు మృత్యువాత పడ్డారు.

ఇదిలావుంటే.. అలీగఢ్‌లో అత్పల్పంగా 3.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, గరిష్టంగా 11.2గా ఉంది. లక్నోలో కనిష్ట ఉష్ణోగ్రత 7.7గా, గరిష్ట ఉష్ణోగ్రత 14.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అయితే.. ఈ సీజన్‌లోనే అతి త‌క్కువ‌ ఉష్ణోగ్రత డిల్లీలో నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 4.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Next Story