సీజేఐ రంజన్ గొగొయ్‌తో యూపీ సీఎస్‌, డీజీపీ భేటీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2019 9:53 AM GMT
సీజేఐ రంజన్ గొగొయ్‌తో యూపీ సీఎస్‌, డీజీపీ  భేటీ..!

ఢిల్లీ: రాబోతున్న అయోధ్య తీర్పు నేతల్ల్లో, పాలక వర్గాల్లో వేడిని రగిలిస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ను ఉత్తర్‌ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కలిసి చర్చలు జరిపారు. త్వరలో అయోధ్య తీర్పు రానున్న నేపథ్యంలో యూపీ ముఖ్య అధికారులతో సీజేఐ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతలను రంజన్ గొగయ్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల డీజీపీలను కేంద్రం అలర్ట్ చేసింది. అయోధ్య తీర్పు నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. తీర్పు ఎలా ఉన్నా అన్ని వర్గాల వారు సహనం, శాంతియుతంగా ఉండాలని కేంద్ర హోంశాఖ విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, హింసకు చోటు కల్పించే పోస్ట్ లు పెట్టొద్దని కోరింది. యూపీలో 34 జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తీర్పు నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను ఆర్‌ఎస్‌ఎస్ రద్దు చేసుకుంది. హిందూ, ముస్లిం మద్దతు దారులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దని కేంద్రం హెచ్చరించింది. అయోధ్యలో పరిస్థితులను ఎప్పటికి అప్పుడు కేంద్ర హోంశాఖ పరిశీలిస్తుంది.

Next Story