అన్‌లాక్ 3.0: ఆగస్టు 5 నుంచి యోగా, జిమ్ సెంటర్లకు అనుమతి.. మార్గదర్శకాలివే..
By సుభాష్ Published on 3 Aug 2020 5:10 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో అన్‌లాక్ 3.0లో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా యోగా సెంటర్లు, జిమ్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. కంటైన్‌మెంట్ జోన్లలో యోగా సెంటర్లు, జిమ్‌లను ఎట్టి పరిస్థితుల్లో తెరిచేది లేదని స్పష్టం చేసింది. అలాగే 65 సంవత్సరాలు దాటిన వారు, గర్భిణులు, పది సంవత్సరాల్లోపు పిల్లలు వెంటిలేషన్ లేని జిమ్‌లకు వెళ్లకపోవడమే ఉత్తమమని తెలిపింది.
కేంద్రం విధించిన మార్గదర్శకాలు ఇవే..
► ప్రతి ఒక్కరు ఆరు అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాల్సిందే.
► పరిసరాల్లో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి. అలాగే యోగా, ఎక్సర్‌సైజ్ చేసే సమయంలో ముఖానికి వైజర్ వాడాలి. ఎన్-95 మాస్కులను వాడితే శ్వాస తీసుకోవడంతో కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అందుకే తెలికపాటి వైజర్ లాంటివి వాడాలి.
► తరచూ చేతులను శుభ్ర పర్చుకోవాలి. శానిటైజర్లు వాడటం మంచిది.
►ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే రాష్ట్ర లేదా జిల్లా హెల్ప్ లైన్ నంబర్‌కు సంప్రదించాలి.
► పరిసరాల్లో ఉమ్మడం నిషేధం
► ప్రతి ఒక్కరు ఆరోగ్యసేతు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఇలాంటి నిబంధనలకు అనుగుణంగా యోగా సెంటర్లు, జిమ్‌లను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించింది.